Epilepsy Symptoms and Precautions: నడుస్తూ.. నడుస్తూ సడన్ గా కిందపడిపోవడం, కాళ్లు, చేతులు బిగుతుగా మారడం.. ఈ లక్షణాలు చూస్తుంటే ఏ వ్యాధో గుర్తొస్తోందా. మీరు అనుకున్నది నిజమే ఈ లక్షణాలు అన్ని మూర్ఛకు సంబంధించినవే. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా మూర్ఛ వ్యాధి వేధిస్తుంది. దీన్నే ఫిట్స్, ఎపిలెప్సీ అంటారు. ఇది మెదడు నరాలకు సంబంధించిన వ్యాధి. ఇది ఒకసారి వచ్చిందంటే పోదు. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక రుగ్మతగా మారిపోతుంది. నియంత్రణే కానీ నివారణ ఉండదు. అసలు ఇది ఎందుకు వస్తుంది..? లక్షణాలు ఏంటి..? తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో చూద్దాం..
ఎందుకు వస్తుంది?:మూర్ఛ రావడానికి ఇది కారణం అని ఎవరూ చెప్పలేరు. కానీ మెదడుకు గాయం, హైఫీవర్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం, మెదడులో కణితి ఏర్పడడం, అల్జీమర్స్ వ్యాధి ఉండడం, పుట్టినప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం, ఎయిడ్స్, మెనింజైటిస్ వ్యాధి ఉండడం వంటి పరిస్థితుల్లో మూర్ఛ వ్యాధి వస్తుంది.
మగాళ్లకన్నా మహిళల్లోనే తలనొప్పి ఎక్కువ! - ఎందుకో తెలుసా?- రీసెర్చ్‌లో విస్తుపోయే నిజాలు!
ఎప్పుడు వస్తుంది?:మూర్ఛ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మూర్ఛ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. జ్వరం అధికంగా ఉన్నప్పుడు, శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గినప్పుడు, తలకు దెబ్బలు తగిలినప్పుడు ఫిట్స్ వస్తుంది.
లక్షణాలు:మెదడులో ప్రభావితమైన భాగంపై ఆధారపడి మూర్ఛ లక్షణాలు ఉంటాయి. అవయవాలు వణకడం, ఆకస్మికంగా పడిపోవడం, తదేకంగా చూడటం, ఆందోళన, స్పృహ కోల్పోవడం, స్ట్రేంజ్ ఎమోషనల్ ఫీలింగ్, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జనరేషన్ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!
మూర్ఛ రకాలు:మూర్ఛల్లో రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫోకల్ ఫిట్స్. బ్రెయిన్లోని ఒక భాగంలో అసాధారణ కార్యకలాపాల వల్ల ఇది వస్తుంది. ఇది ప్రమాదకరం. ఇందులో కూడా రెండు ఉంటాయి.
- స్పృహ కోల్పోవటం:ఈ సమయంలో మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకునే స్థితిలో మీరు ఉండరు. మీకు అంతా అయోమయంగా ఉంటుంది లేదా నమలడం, చేతులు రుద్దడం లేదా గుండ్రంగా తిరగడం లాంటివి చేస్తారు.
- స్పృహ కోల్పోకుండా ఉండటం:ఈ మూర్ఛలు మీ భావోద్వేగాలను మార్చుతాయి. అంతేకాకుండా.. మీ దృష్టి, వాసన, రుచి లేదా వినికిడిపై ప్రభావం చూపుతాయి.