తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గుడ్డు, బ్రెడ్డు, మ్యాగీ.. ఎందులో ఎన్ని క్యాలరీలు?

మీరు ఫిట్​నెస్​కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా? అయితే.. రోజూ ఏం తింటున్నారు? వాటితో వచ్చే కేలరీల్ని సరైన రీతిలో కరిగిస్తున్నారా? లేకుంటే కష్టమేనట. ఇవి శరీరంలో కొవ్వుగా నిల్వ అయి.. ఊబకాయానికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది తింటే ఎంత క్యాలరీల శక్తి వస్తుందో తెలుసుకుని... అందుకు అనుగుణంగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

Eggs to Bread and Maggi, this is how many calories these 13 everyday food items have
గుడ్డూ, బ్రెడ్డూ, మ్యాగీ.. ఫిట్​నెస్​ రహస్యాలివే!

By

Published : Jun 1, 2020, 6:19 PM IST

కేలరీలు లెక్కించుకుని మరీ ఆహారం తీసుకుంటున్న రోజులివి. తాము ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఖర్చు ఎంతైనా కేలరీలు కరగాల్సిందే అంటున్నారు. శారీరకంగా దృఢంగా ఉండేందుకు, బరువు తగ్గించుకునేందుకు, మంచి శరీర ఆకృతికి, జీవనశైలి వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు వ్యాయామశాలల్లో కసరత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

మనం తినే, తాగే వాటి నుంచి వచ్చే శక్తితో.. శ్వాస తీసుకోవడం సహా నడవడం, మాట్లాడటం, తినడం చేస్తున్నాం. అయితే.. ఈ ప్రక్రియలతో ఆ కేలరీలన్నీ కరగవు. మిగతా కేలరీలు మన శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతాయి. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది.

అందుకే.. ఫిట్​నెస్​ లక్ష్యాలకు అనుగుణంగా సంపాదించిన కేలరీలను కరిగించుకోండి. నిత్యం మనం తినే 13 ఆహార పదార్థాల్లో కేలరీలు ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకోండి. వాటికి అనుగుణంగా వ్యాయామం చేస్తూ ఫిట్​గా మారండి.

ఎందులో ఎన్ని కేలరీలు?

1. గుడ్డు...

గుడ్డులో పోషకవిలువలు అధికంగా ఉంటాయి.

గుడ్డు

ఒక ఉడకబెట్టిన గుడ్డు- 77 కేలరీలు

ఆమ్లెట్​-104 కేలరీలు

2. బ్రెడ్డు

ఒక బ్రౌన్​ బ్రెడ్డు భాగం- 68 కేలరీలు

బ్రెడ్డు

3. అరటి పండు

ఒక బనానా- 55 కేలరీలు

బనానా

4. రోటీ

ఒక రోటీ- 85 కేలరీలు

రోటీ

5. చికెన్​

చికెన్ 150 గ్రా.-163 కేలరీలు

చికెన్​

6. అన్నం

ఒక బౌల్​- 120 కేలరీలు

రైస్​

7. యోగర్ట్

ఒక బౌల్​- 90 కేలరీలు

పెరుగు

8. పనీర్​

50 గ్రా- 133 కేలరీలు

పనీర్​

9. బంగాళా దుంపలు

50 గ్రా ఉడకబెట్టిన బంగాళదుంపలు-44 కేలరీలు

బంగాళదుంప

10. పప్పులు

ఒక బౌల్​ కందిపప్పు- 270 కేలరీలు

పప్పులు

11. మ్యాగీ

ఒక బౌల్​- 246 కేలరీలు

మ్యాగీ

12. కేక్​

ఒక చాకొలేట్​ కేక్​ ముక్క- 235 కేలరీలు

కేక్​

13. కోలా

ఒక గ్లాస్- 108 కేలరీలు​

కోలా

గమనిక:మీరు తినే ఆహారం, దాని తయారీ విధానంతో పాటు నూనె / నెయ్యి / వెన్న మొదలైనవాటిని బట్టి కేలరీల పరిమాణం మారుతుంటుంది. మీ డైట్​లో భాగంగా ఈ ఆహార పదార్థాలను తీసుకునే ముందు.. అన్నింటినీ ఓసారి పరిశీలించండి.

ABOUT THE AUTHOR

...view details