Eggs In Breakfast : రోజుకో యాపిల్ తింటే.. డాక్టర్‌ను కలవాల్సిన అవసరం ఉండదు అన్నది ఎప్పటి నుంచో వింటున్న మాట. ఇదేవిధంగా.. రోజుకో గుడ్డు తినడం వల్ల కూడా.. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం అంతగా రాదని అంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా బరువు తక్కువ కావాలనుకునే వారు రోజూ వారి ఆహారంలో.. గుడ్డు తీసుకోవడం వల్ల మంచి మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే.. ఆ గుడ్డును బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే మంచిదేనా? ఉదయమే గుడ్డు తినడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు మంచిదేనా ?
రోజు వారి ఆహారంలో గుడ్డు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇందులో శరీరానికి కావాలసిన పోషకాలన్నీ ఉంటాయి. అందుకే గుడ్డును సూపర్ ఫుడ్ అని అంటారు. గుడ్డులోని తెల్లసొనలో 50 శాతం ప్రోటీన్, పచ్చసొనలో 90 శాతం కాల్షియం, ఐరన్ ఉంటాయి. అయితే.. ఈ గుడ్డును మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిదేనా అంటే.. మంచిదే అంటున్నారు నిపుణులు. వ్యాయమాలు చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ తినడం వల్ల మధ్యాహ్నం ఆకలి ఎక్కువగా వేయదని అంటున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు, ఆకలిని నియంత్రించుకోవాల్సిన పని లేదు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్‌లు ఉండే గుడ్లను ఆహారంగా తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
బ్లాక్‌హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?- ఈ టిప్స్ ఫాలో అయ్యి మీ సమస్యకు స్వస్తి పలకండి!
గుడ్డు తినడం వల్ల అందే పోషకాలు..
ప్రతిరోజూ ఉడికించిన కోడిగుడ్డు తినడం వల్ల మన శరీరానికి అందే పోషకాల శాతం ఓసారి చూస్తే..
- ఫోలేట్ - 5 శాతం
- సెలీనియం - 22 శాతం
- ఫాస్ఫరస్ - 9 శాతం
- విటమిన్ ఎ - 6 శాతం
- విటమిన్ బి2 - 15 శాతం
- విటమిన్ బి5 - 7 శాతం
- విటమిన్ బి12 - 9 శాతం