తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నోరూరించే ఎగ్​-65.. చిటికెలో చేసుకుందామిలా... - ఎగ్ 65 చేసేందుకు కావలసినవి

నాలుగు చినుకులు పడటం ఆలస్యం... కప్పు టీ లేదా కాఫీతోపాటు కాస్త కారంగా, వేడివేడిగా ఏవైనా స్నాక్స్‌ తినాలనిపించడం మామూలే. అలాంటి సమయాల్లో ఉడికించిన గుడ్లతో ఎగ్ 65ను చేసుకుని ఆస్వాదించండి..

egg 65
ఎగ్​ 65

By

Published : Jul 14, 2021, 4:48 PM IST

చికెన్​ 65ను రుచి చూసే ఉంటారు. మరి పోషకాలతో పాటు, రుచినీ అందించే ఎగ్​ 65ను ఎప్పుడూ ట్రై చేయలేదా? అయితే.. ఇంట్లోనే ఉడికించిన గుడ్లతో ఎగ్​65 చేసుకుని ఈ చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా ఆరగించండి..

ఎగ్‌ 65

కావలసినవి:ఉడికించిన గుడ్లు: ఆరు, గుడ్డు: ఒకటి, మొక్కజొన్నపిండి: పావుకప్పు, కారం: రెండు చెంచాలు, గరంమసాలా: పావుచెంచా, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా, వెల్లుల్లి తరుగు: చెంచా, అల్లం తరుగు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి తరుగు: చెంచా, పెరుగు: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, బ్రెడ్‌పొడి: పావుకప్పు, చిల్లీసాస్‌: ఒకటిన్నర చెంచా.

ఎగ్​ 65

తయారీవిధానం: ఉడికించిన గుడ్లను తురిమి దానిపైన మొక్కజొన్నపిండి, సగం కారం, గరంమసాలా, తగినంత ఉప్పు, అల్లంవెల్లులి ముద్ద, గుడ్డుసొన, బ్రెడ్‌పొడి వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. స్టౌమీద మరో బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేసి అల్లం, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి, పెరుగు, చిల్లీసాస్‌ కొద్దిగా ఉప్పు, మిగిలిన కారం, ముందుగా వేయించుకున్న ఉండల్ని కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.

ఇదీ చూడండి:చిరుతిండి వల్ల బరువు తగ్గుతుందా?

ఇదీ చూడండి:సాటిలేని రుచికి కేరాఫ్ 'చికెన్‌ ఫ్రాంకీ'!

ABOUT THE AUTHOR

...view details