Mango Benefits: హాట్.. హాట్ సమ్మర్‌లో దొరికే టేస్టీ..టేస్టీ మామిడి పండ్లంటే ఇష్టముండని వారుండరు. చాలా మంది మామిడి పండ్లు రుచి ఎంజాయ్ చేయడానికి వేసవి ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే మామిడి పండ్లకు ఉండే క్రేజ్ అలాంటిది. మామిడి పండు రుచిలోనే కాదు పోషకాల్లోనూ రారాజే.. ఈ పండులో విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయారియా, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా శరీరానికి ఎంతో అవసరమైన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
మామిడి పండును తరచూ తింటే గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చని నిపుణులు అంటున్నారు. "బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. మామిడిలో ఉండే ఐరన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వల్ల గుండె నుంచి ప్రవహించే ధమనుల్లో ఎలాంటి అడ్డంకి లేకుండా కాపాడుతాయి. పాలీఫెనాల్ బయోయాక్టివ్‌గా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి సమృద్ధిగా లభ్యమవుతాయి. శరీరానికి కావలసిన యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. మామిడి తొక్కలో ఉండే కెమికల్ శరీర కొవ్వును తగ్గిస్తుంది." అని నిపుణులు చెబుతున్నారు.