Cashew nut is good for pregnancy: జీడిపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు, లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని రోజూ మన ఆహారంలో భాగం చేసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ జీడిపప్పును సంతానం లేనివారు తీసుకుంటే పిల్లలు కలుగుతారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇందులో నిజమెంత? నిపుణుల మాటేంటి? జీడిపప్పులో ఎలాంటి పోషకాలు ఉంటాయి?
జీడిపప్పులో ఉండే పోషకాలు
- జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ.
- విటమిన్ ఇ, కె, బి6 పుష్కలం.
- క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండు
జీడిపప్పు- ఆరోగ్య ప్రయోజనలు
- జీడిపప్పు తినడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
- జీడిపప్పులో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడతాయి.
- కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా దీనిని డైట్‌లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది.
- హృద్రోగాల ముప్పును నివారిస్తాయి.
- ఉడికించిన మాంసంలో ఉండే ప్రొటీన్‌కు సమానంగా జీడిపప్పులోనూ ప్రొటీన్ ఉంటుంది.
- జీడిపప్పులోని కాపర్ బుద్ధి కుశలతను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
- మెగ్నీషియం, మాంగనీస్ కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- వేయించుకుని లేదంటే, గ్రైండ్ చేసుకుని తింటే జీడిపప్పు సులభంగా జీర్ణమవుతుంది.
- మధుమేహ రోగులు, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు జీడిపప్పు తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.