ముఖం అందంగా నిగనిగలాడాలని (face skin glow) అందరూ కోరుకుంటారు. ముఖంపై ఉన్న నల్లమచ్చలు, జిడ్డును తొలగించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. కొందరైతే బ్యూటీపార్లర్లకు వెళ్లి ఫేస్‌మాస్క్ చేయించుకుంటారు. అంత అవసరం లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే (face skin glow home remedies) ఫేస్‌మాస్క్‌ను తయారు చేసుకుని అందంగా తయారవచ్చు.
కావల్సిన పదార్థాలు: శనగపిండి, పసుపు, పాలు, ఆలివ్ ఆయిల్, తేనె.
ఫేస్‌మాస్క్ తయారీ: శనగపిండిని బౌల్లో తీసుకుని కొంచెం ఆలివ్ ఆయిల్ కలపాలి. దానిలో కొన్ని పాలు కలుపుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో తగినంత తేనె కలపాలి.
ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ముఖంపై పూసుకని 15 నిమిషాలు అలాగే ఉండాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే నిగనిలాడే ముఖం మీ సొంతమవుతుంది!
ఇదీ చదవండి:ఈ చిట్కాలతో చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోండి!