తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

జుట్టు రాలిపోతుందా? ఇలా ట్రై చేసి చూడండి - జుట్టు రాలుతుందా

Hair Fall Solution: జుట్టు రాలిపోవడం అనేది ఈ మధ్య అంతా ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమందిని ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలో దీనిని పరిష్కరించగలిగే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం రండి.

Easy Tips to Reduce Hair Fall in Telugu
Easy Tips to Reduce Hair Fall in Telugu

By

Published : Aug 13, 2022, 7:00 AM IST

Hair Fall Solution: చిన్నాపెద్దా అనే తేడాలేకుండా ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య జుట్టు రాలిపోవడం. ఒత్తిడి, గాఢత ఉన్న షాంపూలు, ఇతర హెయిర్​ క్రీంల వాడకం, జీన్స్​ వంటి కారణాలేమైనా ఉండొచ్చు. అయితే కొన్ని చిట్కాలతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

ఆముదం నూనె మిశ్రమంతో..

ఆముదం నూనె
కప్పు ఆముదం నూనెలో టీస్పూన్‌ రోజ్‌మేరీ నూనె వేసి బాగా కలపాలి. ఈ నూనెల మిశ్రమాన్ని ఒక గ్లాస్‌ జార్‌లో భద్రపరచుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తున్నట్లయితే జుట్టు రాలిపోయే సమస్య తగ్గుముఖం పట్టడం కొన్ని రోజుల్లోనే గమనించచ్చు.. అంతేకాదు.. జుట్టు ఒత్తుగా పెరిగేందుకూ ఈ నూనె తోడ్పడుతుంది.

కొబ్బరి పాలతో సిల్కీగా!

కొబ్బరి పాలు
గరుకుగా, గడ్డిలా మారిన జుట్టును రిపేర్‌ చేయడానికి కండిషనర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఇందుకోసం బయట దొరికేవి కాకుండా మన వంటింట్లో ఉండే కొబ్బరి పాలను ఉపయోగిస్తే తక్షణ ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని కొబ్బరి పాలలో కొద్దిగా ఆర్గాన్‌ ఆయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.. షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూ చేసుకుంటే జుట్టు మృదువుగా, సిల్కీగా మారడం గమనించచ్చు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

  • కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి.. పడుకునే ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. కాసేపు కుదుళ్లను మర్దన చేసి షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
  • జుట్టు వదిలేసుకొని నిద్ర పోతుంటారు కొంతమంది. తద్వారా కేశాలు గడ్డిలా, పిచ్చుక గూడులా మారతాయి. అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జడ వేసుకోవడం, పైకి ముడేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకొస్తుంది.
  • వీటితో పాటు తీసుకునే ఆహారంలో 'ఎ', 'బి', 'సి', 'డి', 'ఇ'.. వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవడమూ ముఖ్యమే!

గమనిక
ఇక్కడ పేర్కొన్నవన్నీ సహజమైన పదార్ధాలే అయినా కొన్ని పదార్ధాలు కొందరికి పడకపోవచ్చు. అందువల్ల వీటిని వాడే విషయంలో ఏవైనా సందేహాలున్నట్లయితే మీరు వ్యక్తిగతంగా సంప్రదించే సంబంధిత నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు.

ఇవీ చూడండి:జుట్టు కుదుళ్లు బలంగా మారాలా?.. ఇవి తినేయండి!

జుట్టు రాలుతోందా?.. దీనితో తలస్నానం చేస్తే సరి!

ABOUT THE AUTHOR

...view details