Early Symptoms of Glaucoma: ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏటా ఎంతో మందిని అంధులుగా మారుస్తున్న ఆ వ్యాధిపేరు "గ్లకోమా". దీనిపై చాలా మంది ప్రజలకు సరైన అవగాహన లేదు. అసలు.. గ్లకోమా అంటే ఏమిటి..? అది ఎలా దెబ్బ తీస్తుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్నది ఈ స్టోరీలో చూద్దాం.
గ్లకోమా అంటే : గ్లకోమా అనేది.. ఆప్టిక్ నాడి దెబ్బతినే పరిస్థితి. ఇది కంటి నుంచి మెదడుకి సంకేతాలు పంపిస్తుంది. మంచి దృష్టికి ఆప్టిక్ నాడి చాలా ఇంపార్టెంట్. ఇది నాశనం కావడం ద్వారా సమస్య మొదలవుతుంది. కంటికి అధిక ఒత్తిడి తగిలినప్పుడు ఈ నరాలు దెబ్బతింటాయి. అలా జరగడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. అయితే ఈ వ్యాధి ప్రారంభ దశలో లక్షణాలూ పెద్దగా కనిపించవు. కానీ.. కొన్ని సాధారణ లక్షణాలను గుర్తించడం ద్వారా గ్లకోమాను ప్రారంభ దశలోనే గుర్తించి.. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
మీ శరీరం ఈ హెచ్చరికలు చేస్తోందా? - అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే!
ప్రైమరీ ఓపెన్-యాంగిల్ గ్లకోమా:గ్లకోమా రెండు విధాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి ప్రైమరీ ఓపెన్-యాంగిల్ గ్లకోమా.ఇది చాలా సాధారణ రకం. కంటిలో నీటి ప్రవాహం ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్ వస్తుంది. దీనివల్ల కంటి లోపల ఉన్న ద్రవం సరిగా ప్రవహించదు. క్రమంగా ఆప్టిక్ నర్వ్‌ని దెబ్బతీస్తుంది.
యాంగిల్-క్లోజర్ గ్లకోమా:రెండోదికంటిలోని డ్రైనేజ్ యాంగిల్ మూతబడినప్పుడు లేదా పాక్షికంగా బ్లాక్ అయినప్పుడు వచ్చే సమస్య. ఇది IOP (Intraocular Pressure) పెరుగుదలకు కూడా దారి తీస్తుంది. కంటి మీద పడే ఒత్తిడిని Intraocular Pressure రూపంలో లెక్కిస్తారు. ఇది పెరగడం వల్ల కూడా కంటి నరాలు దెబ్బతింటాయి.
గ్లకోమా రావడానికి కారణాలు:కంటి లోపల ఒత్తిడి పెరగడం, వంశపారపర్యంగా సంభవించడం, హైపోటెన్షన్, డయాబెటిస్, మెల్లిటస్, కంటికి గాయం అయినప్పుడు, కంటి ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఓ అధ్యయనంలో తెలిపింది.
వ్యాయామం చేయడానికి టైమ్ లేదా? - ఆఫీసులోనే ఈ వర్కౌట్స్ చేయండి - పూర్తి ఆరోగ్యంగా ఉంటారు!