Type 2 Diabetes Symptoms : ప్రస్తుతం అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలే. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవరకూ అనుక్షణం పని ఒత్తిళ్తతో చాలా మంది సతమతమవుతున్నారు. ఏ మాత్రం శారీరక శ్రమలేని పనులు పెరిగిపోవటం, టైమ్‌కు భోజనం చేయకపోవటం, సరైన నిద్రలేకపోవటం వంటివన్నీ శరీరంపై ప్రభావం చూపేవే. ఈ కారణంగా నేటి కాలంలో ఎక్కువ మంది ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య.. డయాబెటిస్(Diabetes). ఇది ఒక్కసారి వచ్చిందంటే దీని నుంచి తప్పించుకోలేమనే విషయం మీరు గమనించాలి. ఇకపోతే సాధారణంగా ఈ డయాబెటిస్(మధుమేహం) ప్రారంభ లక్షణాలు అంత త్వరగా గుర్తించలేము.
Diabetes Symptoms :అలాగే శరీరంలో చాలా కాలం నుంచి ఆ వ్యాధి ఉన్నా.. వ్యాధి తీవ్రమైన తర్వాతనే లక్షణాలు బయట పడుతుంటాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ చాలా ఆలస్యంగా లక్షణాలు చూపిస్తుంది. కానీ, మీరు ముందుగానే ఈ వ్యాధిని గుర్తించాలంటే బాడీలో చోటుచేసుకునే కొన్ని సంకేతాలను గమనించడం చాలా అవసరం. అవి మీలో ఉన్నాయంటే.. రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉందని మీరు తెలుసుకోవాలి. ఒకవేళ మీకు ఏవైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం బెటర్. మరి ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తరచుగా మూత్రవిసర్జన :టైప్ 2 మధుమేహం ఉందని చెప్పే లక్షణాల్లో ఒకటి తరచుగా మూత్ర విసర్జన. అలాగే షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఆకలి వేస్తుంటుంది.
ఆకస్మాత్తుగా బరువు తగ్గడం :ఈ వ్యాధి మరో లక్షణం ఆకస్మాత్తుగా బరువు తగ్గడం. ఇది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. మీరు డైలీ ఎలా తింటారో అలా తింటున్నా, తాగుతున్నా.. బరువు తగ్గుతున్నారా? అయితే మీరు రక్త పరీక్ష కోసం వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
నిద్రపోయినా ఆలసటగా ఉంటే : మీరు రాత్రి బాగా నిద్రపోయినా.. మార్నింగ్ లేచిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తుందా? అయితే అది మధుమేహం వల్ల కూడా రావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అలసట అనేది పోదు. కాబట్టి టైప్ 2 డయాబెటిస్ వచ్చిందని చెప్పే మరో లక్షణంగా నిద్రపోయినా ఆలసటగా ఉండడాన్ని చెప్పుకోవచ్చు. అలాగే బలహీనంగా అనిపించినా, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.