తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే తగ్గిపోతుంది! - చుండ్రు నివారణకు చిట్కాలు

ఆహారపు అలవాట్లు, వాతావరణం లాంటి అనేక కారణాల వల్ల చాలామందిలో చుండ్రు సమస్యలు తలెత్తుతాయి. చుండ్రు నివారణ కోసం ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితాలు ఉండకపోవడం వల్ల విసిగిపోతుంటారు. అసలు చుండ్రు సమస్యలు ఎందుకు వస్తాయి, జుట్టు పొడిబారడానికి దానికి ఉన్న తేడాలు ఏంటి? చుండ్రును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.

dandruff removal tips
dandruff removal tips

By

Published : Mar 2, 2023, 6:22 AM IST

Dandruff Removal Tips : చుండ్రు చాలామందిని వేధిస్తుంటుంది. భుజాల మీద చుండ్రు పడటం, అందరిలో వెళ్లినప్పుడు అది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. చుండ్రు, జుట్టు పొడిబారడం అనేవి రెండు వేర్వేరు అంశాలు. కానీ చాలామంది మాత్రం జుట్టు పొడిబారినా చుండ్రు సమస్య మొదలైందని అనుకుంటారు. ఈ రెండింటిలో ఉన్న తేడాలతో పాటు నివారణ మార్గాలను తెలుసుకుందాం.

చుండ్రు, జుట్టు పొడిబారడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. మాడు పొడిబారి పొట్టులేస్తుంటే దానినే చాలామంది చుండ్రు అనుకుంటారు. దానిని అరికట్టడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూలను కూడా వాడుతుంటారు. చుండ్రు సమస్యలు ఎక్కువైతే జుట్టు రాలడం, పలుచబడటం, చిట్లడం లాంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. చుండ్రు.. మాడు పొడిబారడం వల్ల జుట్టు అందం తగ్గడమే కాకుండా చర్మం అందం కూడా తగ్గుతుంది. చుండ్రు ఏర్పడటానికి అనేక కారణాలను చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పులు, తరుచూ వేర్వేరు ప్రదేశాలు తిరగడం, నీటిలో మార్పునకు తోడు వాతావరణ మార్పుల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.

"చుండ్రు, మాడు పొడిబారడం గురించి చాలామందికి తెలియదు, ఈ రెండింటికి తేడా ఏంటని తెలియకపోవచ్చు. చుండ్రు ఫంగల్ ఇన్ ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. మాడులో ఎక్కువ నూనెలు ఉత్పత్తి అవడం వల్ల ఫంగస్ పెరిగి చుండ్రు వచ్చే అవకాశాలు ఉంటాయి. తలమీద మృతకణాల సంఖ్య విపరీతంగా పెరగడం కూడా చుండ్రు పెరగడానికి కారణం కావచ్చు. చుండ్రును తగ్గించాలంటే చక్కగా షాంపూ వాడటం, అలోవేరా లాంటివి వాడటం, తలస్నానానికి ముందు నిమ్మరసం ఉపయోగిండం, యాంటీ ఫంగల్ షాంపూలను వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి."
-డా.శైలజ సూరపనేని, డెర్మటాలజిస్ట్

ఈమధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా పెద్ద, చిన్నవారిలో చుండ్రు సమస్య తలెత్తుతోంది. కొంతమందిలో వంశపారంపర్యంగా, జన్యుపరంగా చుండ్రు వస్తుంటే.. మరికొందరిలో మాత్రం వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వస్తోంది. చుండ్రు ఎక్కువైతే జుట్టు రాలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చుండ్రు పట్ల జాగ్రత్తగా ఉంటే మంచిది. తలస్నానం చేయకపోతే నూనె, మృతకణాలు ఎక్కువైపోయి ఈస్ట్ ఫంగస్ వంటి వాటికి ఆహారంగా మారతాయి. దీని వల్ల చుండ్రు పెరుగుతుంది. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల సెబీషియస్ గ్రంథి నుండి నూనె ఎక్కువగా ఉత్పత్తి అయి చుండ్రు మరింత ఎక్కువ అవుతుంది.

మన ఇళ్లలో ఒకే దువ్వెనతో ఇంటి సభ్యులం అందరం తలదువ్వుకోవడం లాంటివి చేస్తుంటాం. ఇలా చేయకూడదని వైద్యులు చెబుతుంటారు. ఎవరికి వారు వేరుగా దువ్వెనను వాడితే చుండ్రు లాంటి సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే షాంపూతో స్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదిలేలా చూసుకోవాలి.

చుండ్రు రావడానికి బలమైన కారణాల్లో ఒకటి కలుషిత వాతావరణం కాబట్టి వీలైనంత వరకు కలుషిత వాతావరణంలోకి వెళ్లకపోవడం, వెళ్లినా జుట్టు పట్ల సరైన సంరక్షణ చర్యలను తీసుకోవడం అవసరం. ఇక బాగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, తీపి పదార్థాలను తగ్గించడం, మద్యం తీసుకోవడాన్ని తగ్గిస్తే చుండ్రు సమస్య అదుపులోకి వస్తుంది.

ధ్యానం చేస్తే..
మరోపక్క ఒత్తిడిని తగ్గించుకునేలా నిత్యం ధ్యానం, యోగా లాంటివి చేస్తే చుండ్రు రాకుండా ఉంటుంది. మార్కెట్లో లభిస్తున్న రకరకాల హెయిర్ ఆయిల్స్​కు బదులుగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను జుట్టుకు రాయాలి. వ్యాయామం లేయడం వల్ల లేదంటే మరోలా చమట పడితే.. శరీరంతో పాటు జుట్టును కూడా శుభ్రం చేసుకోవాలి.

ఇవీ చదవండి :పొగ తాగుతున్నారా..? అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే..!

ఎక్కువ టైం టీవీ, ఫోన్​ చూస్తున్నారా?.. తస్మాత్​ జాగ్రత్త.. లేకుంటే కష్టమే!

ABOUT THE AUTHOR

...view details