తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నీళ్లు బాగా తాగితే సులువుగా బరువు తగ్గుతారట! - more wtter for weight loss

బరువు తగ్గడానికి నోరుకట్టుకుంటున్నా ఫలితం లేదా? వ్యాయామాలు చేస్తున్నా వేగంగా వెయిట్​ తగ్గడం లేదా? అయితే, రిలాక్స్​ అయ్యి నీళ్లు తాగండి తగ్గిపోతారు. అవును, నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో తేలింది. నీటితో కొవ్వు ఎలా కరుగుతుందో తెలుసుకుందాం రండి..

health news
నీళ్లు బాగా తాగితే సులువుగా బరువు తగ్గుతారట!

By

Published : Jul 1, 2020, 10:30 AM IST

Updated : Jul 1, 2020, 10:51 AM IST

బరువు తగ్గటానికి రకరకాల మార్గాలున్నాయి. ఇంకాస్త ఎక్కువగా నీళ్లు తాగటం కూడా వీటిల్లో ఒకటి. దీంతో కేలరీలు మాత్రమే కాదు.. కొవ్వు, చక్కెర, సోడియం తీసుకోవటం కూడా తగ్గుతున్నట్టు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది.

మనం సగటున రోజుకు 1-2 లీటర్ల నీళ్లు తాగుతామని అంచనా. ఇది రోజు మొత్తమ్మీద తాగే ద్రవాలలో 30% మాత్రమే. మిగతాదంతా కాఫీ, టీ, పండ్ల రసాల వంటి వాటి రూపంలోనూ.. ఆహారంలోని నీటి ద్వారానూ లభిస్తుంది. అయితే దీనికి అదనంగా రోజుకు పావు లీటరు నుంచి ముప్పావు లీటరు నీరు తాగినవారు 68-205 కేలరీలు తక్కువగా తీసుకుంటుండటం గమనార్హం.

నీళ్లు తాగండి.. ఇలా బరువు తగ్గిపోతారు!

అలాగే సోడియం 78-235 మిల్లీగ్రాములు, చక్కెర 5-17 గ్రాములు, కొలెస్ట్రాల్‌ 7-21 మిల్లీగ్రాములు తక్కువగా తీసుకుంటున్నట్టూ బయటపడింది. దీనికి కారణం లేకపోలేదు. అదనంగా తీసుకునే నీటితో కడుపు నిండిన భావన కలుగుతుంది.

నీరు అధికంగా తాగడం వల్ల ఎక్కువెక్కువగా తినటం తగ్గటమే కాదు.. కేలరీలు అధికంగా ఉండే తీపి పానీయాలు తాగటమూ తగ్గుతుంది. కేలరీలు, చక్కెర, కొవ్వులు తీసుకోవటం తగ్గితే బరువూ అదుపులో ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే, మూత్ర విసర్జన అనంతరం.. ఇలా వీలైనప్పుడల్లా ఒక గ్లాసు నీరు తాగటం అలవాటు చేసుకుంటే బరువు తగ్గటంతో పాటు ఇతరత్రా సమస్యలనూ నివారించుకునే వీలుంటుంది.

ఇదీ చదవండి:చేదోడుగా ఉండే 'చేతి వేళ్ల'ను ఫిట్​గా ఉంచండిలా!

Last Updated : Jul 1, 2020, 10:51 AM IST

ABOUT THE AUTHOR

...view details