తిన్న ఆహారం సరిగా జీర్ణం కావటం, మలబద్ధకం దరిజేరకుండా చూడటం వంటి వాటికే కాదు.. బరువు తగ్గటానికీ నీరు తోడ్పడుతుంది. కేలరీలు మరింత ఎక్కువగా ఖర్చు కావటంలో ఇది బాగా తోడ్పడుతుంది. తగినంత నీరు తాగటం వల్ల సుమారు గంటన్నర వ్యవధిలో జీవక్రియల వేగం 24-30% వరకు పెరుగుతున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. అంటే ఇది అదనంగా మరో 96 కేలరీలు ఖర్చు అవటంతో సమానమన్నమాట. భోజనం చేయటానికి అరగంట ముందు నీరు తాగటం మరీ మంచిది. ఇది బరువు తగ్గటానికీ దోహదం చేస్తుంది.
భోజనం చేయటానికి అరగంట ముందు నీరు తాగితే? - drinking water
నీరు.. జీవకోటికి మూలం ఇదే. జలం సర్వరోగ నివారిణి అని అనేక పురాణాలు చేప్తూనే ఉన్నాయి. తగినంత నీరు తాగటం వల్ల సుమారు గంటన్నర వ్యవధిలో జీవక్రియల వేగం 24-30% వరకు పెరుగుతున్నట్టు తాజాగా ఒక అధ్యయనం పేర్కొంటోంది.
![భోజనం చేయటానికి అరగంట ముందు నీరు తాగితే? drinking water use for weight loss](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8517788-39-8517788-1598095806943.jpg)
భోజనం చేయటానికి అరగంట ముందు నీరు తాగితే?