తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బరువు తగ్గడానికి సింపుల్​ చిట్కా- ఫలితం ఆహా! - బరువు తగ్గడం

రోజూ సరిపడా నీరు తాగితే బరువు తగ్గడం(weight loss tips సులువవుతుందని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ, జీర్ణక్రియ ప్రక్రియలు సాఫీగా సాగేందుకు నీరు పనికొస్తుందని అంటున్నారు. ఆకలిని కూడా తీర్చి, శరీర శక్తిని పెంపొందిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

drinking water
నీరు తాగండి బరువు తగ్గండి

By

Published : Jul 9, 2021, 4:56 PM IST

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు(weight loss tips) చేసినా ఫలితం దక్కడం లేదా? అయితే మీ డైట్​కు 'మంచి నీరు' జోడించేయండి.

నీరు ఎక్కువ తీసుకుంటే బరువు తగ్గుతారు(weight loss tips at home). ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఆ వివరాలు మీరూ తెలుసుకోండి.

ఆకలి తీరుస్తుంది!

నీరు కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, ఇతర పనులు కూడా చేస్తుంది. అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు, రోగనిరోధన శక్తి వృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుంది. తగిన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గేందుకు కూడా ఉపకరిస్తుంది. ఆకలి మీద ఉన్న చిరుతిండ్లవైపు మొగ్గుచూపుతూ ఉంటారు. అలాంటి వారు ఆ క్షణంలో నీరు తాగితే సరి!(weight loss diet)

వ్యాయామాలకు తోడుగా..

వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఎక్కువ నీరు తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం(weight loss exercise) సమయంలో శరీరం పనితీరుపై నీరు ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. నీరు తాగడం వల్ల ఎనర్జీ లెవల్స్​ పెరుగుతాయని చెబుతున్నారు.

జీవక్రియ మెరుగుపడుతుంది..

శరీరానికి కొంత నీరు అవసరం. అదనంగా తీసుకునే నీరుతో జీవక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా బరువు తగ్గే ప్రక్రియ పుంజుకుంటుంది.

క్యాలరీలు కరిగించడానికి..

వయసు పెరిగే కొద్దీ.. వ్యాయామం తగ్గిపోయి బరువు పెరుగుతూ ఉంటారు. అందువల్ల కొవ్వు పేరుకుపోతుంది. ఆ కొవ్వు తగ్గించేందుకు శరీరం కష్టపడుతుంది. అదే సమయంలో ఎక్కువ క్యాలరీలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే 3-4 లీటర్ల నీరు తాగితే క్యాలరీల ఇన్​టేక్​ తగ్గుతుంది. చివరకు బరువు కూడా దిగొస్తుంది.

నీటితో శరీరం శుద్ధి..

శరీరం దానంతటే అదే శుద్ధి చేసుకునేందుకు నీరు ఎక్కువ తాగితే సరిపోతుంది. శరీరంలోని క్రిములు, చెత్త, కణాల్లోని బ్యాక్టీరియాను నీరు తొలగిస్తుంది. తాజా పండ్లు, తాజా కూరగాయలు కూడా తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.

సహజసిద్ధమైన ఖనిజ వనరు...

నీరులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. నీరు తక్కువగా తీసుకుంటే, శరీరంలోని ఖనిజ స్థాయి పడిపోతుంది. ఫలితంగా ఊబకాయం వస్తుంది. బరువు తగ్గుదలకు నీరు తీసుకోవడం ఎంతో అవసరం.

పేగుకూ మంచిదే...

ఎంత మోతాదులో నీరు(weight loss water intake) తీసుకోవాలన్నది ఆయా మనుషుల జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. భౌతికంగా యాక్టివ్​గా ఉండాల్సిన వ్యక్తి నీరు ఎక్కువగా తాగాలి. పేగులో ఆహారం కదలికలు సరిగ్గా జరగడానికి నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.

బరువు తగ్గేందుకు నీరు ఏ విధంగా ఉపయోగపడుతుందనేదానికి చాలా కారణాలు ఉన్నాయి. మీకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకుని నీటిని తాగితే అనుకున్న స్థాయిలో బరువు తగ్గొచ్చు.

ఇదీ చూడండి:-రోగ నిరోధక శక్తిలో నీరే కీలకం

ABOUT THE AUTHOR

...view details