మనం సగటున రోజుకు 1-2 లీటర్ల నీళ్లు తాగుతామని అంచనా. ఇది రోజు మొత్తమ్మీద తాగే ద్రవాలలో 30% మాత్రమే. మిగతాదంతా కాఫీ, టీ, పండ్ల రసాల వంటి వాటి రూపంలోనూ.. ఆహారంలోని నీటి ద్వారానూ లభిస్తుంది.
సాధారణంగా అదనంగా రోజుకు పావు లీటరు నుంచి ముప్పావు లీటరు నీరు తాగినవారు 68-205 కేలరీలు తక్కువగా తీసుకుంటుండటం గమనార్హం. అలాగే సోడియం 78-235 మిల్లీగ్రాములు, చక్కెర 5-17 గ్రాములు, కొలెస్ట్రాల్ 7-21 మిల్లీగ్రాములు తక్కువగా తీసుకుంటున్నట్టూ బయటపడింది. దీనికి కారణం లేకపోలేదు. అదనంగా తీసుకునే నీటితో కడుపు నిండిన భావన కలుగుతుంది.