పడుకునే ముందు పాలు తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివన్నీ తగ్గి హాయిగా నిద్రపడుతుందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డుకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో తేలిందట. పాలల్లో ఉండే ట్రిప్టొఫాన్ అనే ప్రొటీన్, మనసుకి సాంత్వన చేకూర్చే సెరటోనిన్ విడుదలకి తోడ్పడుతుంది. ఈ సెరటోనిన్ జీవగడియారాన్ని నియంత్రిస్తూ నిద్రకి కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్‌ను విడదల చేస్తుంది. ఆ కారణంవల్లే పాలు తాగితే త్వరగానూ హాయిగానూ నిద్రపడుతుందట.
పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే..బాగా నిద్రపడుతుందట! - drinking milk before sleep
పడుకునేముందు కాసిని గోరువెచ్చని పాలు తాగి పడుకో, బాగా నిద్రపడుతుంది అంటుంటారు బామ్మలు. అది ఉత్తి నమ్మకమే అని కొట్టిపారేస్తుంటారు నేటి తరం పిల్లలు. కానీ అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డుకి చెందిన పరిశోధకులు సైతం అది నిజమే అంటున్నారు.
గోరువెచ్చని పాలతో మంచి నిద్ర
ఇది పరోక్షంగా బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. నిద్రపట్టడం వల్ల ఆ సమయంలో ఏదైనా తినాలన్న కోరిక తగ్గిపోతుంది. పైగా నిద్ర వల్ల జీవక్రియా వేగం పెరుగుతుంది కాబట్టి గ్లూకోజ్ నిల్వలు పేరుకోవు. అంటే- బరువుకీ పాలకీ సంబంధం లేదు కానీ మంచి నిద్ర వల్ల బరువు పెరగకుండా ఉంటారన్నది మాత్రం నిజం అంటున్నారు పరిశోధకులు.