తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఉదయం పూట ఎక్కువగా తినండి.. లేకపోతే! - హెల్త్ టిప్స్

చాలామంది ఉదయం అల్పాహారం తీసుకునే విషయంలో ఆశ్రద్ధ చూపిస్తుంటారు. మధ్యాహ్నం తినొచ్చులే అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.

don't skip breakfast
బ్రేక్​ఫాస్ట్

By

Published : Aug 28, 2021, 8:31 AM IST

సౌజన్యను అధిక బరువు తగ్గడానికి ఆహారంలో మార్పులు చేసుకోమన్నారు డాక్టర్లు. రోజుకు రెండుసార్లు మాత్రమే తింటున్నా కూడా ఈ సమస్యకు పరిష్కారం దక్కడం లేదని వేదనకు గురవుతున్న ఆమెలాంటి వారికి నిపుణులిస్తున్న సూచనలు ఇవీ...

కడుపునిండుగా... ఉదయం తీసుకునే అల్పాహారాన్ని స్కిప్‌ చేయకూడదు. చాలామంది ఉదయం నుంచి ఏమీ తినకుండా ఒకేసారి మధ్యాహ్న భోజనానికి ప్రాముఖ్యతనిస్తారు. దీనివల్ల ఆహారం మధ్య దాదాపు 14 గంటలు తేడా రావడం వల్ల తెలియకుండానే ఎక్కువ మోతాదులో ఒకేసారి తీసుకోవడం అధికబరువు సమస్యను పెంచుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మొలకలు, ఉడికించిన కూరగాయల ముక్కలు, తాజా పండ్లు, ఉడికించిన గుడ్డు తెల్లసొన ఉండేలా అల్పాహారాన్ని ఎంచుకుంటే కడుపునిండిన భావన కలుగుతుంది. మూడునాలుగు గంటలు ఆకలిని దరి చేరనివ్వదు. ఇది మన జీవక్రియలను సమతుల్యం చేస్తుంది. రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది.

బ్రేక్​ఫాస్ట్

పరగడుపున పానీయాలు... బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు పరగడుపున కొన్ని రకాల పానీయాలను తీసుకోవడం ద్వారా అధిక కొవ్వును దూరం చేసుకోవచ్చు. అవేంటంటే.. గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టి తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎనిమిది గంటలపాటు చెంచా మెంతులను నానబెట్టిన గ్లాసు నీటిని తీసుకుంటే జీవక్రియలు సమతుల్యంగా ఉండేలా దోహదపడుతుంది. వేయించిన చెంచా వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించేలా సాయపడుతుంది. గ్లాసు గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, పావుచెంచా తేనె కలిపి తీసుకుంటే, ఇందులోని యాంటీఆక్సిడెంట్స్‌, పెక్టిన్‌ ఫైబర్‌ శరీరంలోని కొవ్వును కరిగించి అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి. గ్రీన్‌ టీ లోని యాంటీ ఆక్సిండెంట్స్‌ శరీరాన్ని శక్తివంతంగా ఉంచడమే కాదు, అధిక కొవ్వు పేరుకోనివ్వవు.

పోషకవిలువలు.. మధ్యాహ్నం, రాత్రి ఆహారంలో పోషక విలువలకు పెద్దపీట వేయాలి. కార్బోహైడ్రేట్ల శాతం ఎక్కువగా లేకుండా, పీచు, ప్రొటీన్లు ఉండే వాటిని ఎంచుకోవాలి. రోజులో ఐదుసార్లు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటూ, మధ్యలో స్నాక్స్‌గా గింజధాన్యాలు, పండ్లు, ఎండు ఫలాలుండాలి. నిద్రలేమి కూడా అధికంగా ఆకలిని కలిగిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details