తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

డిన్నర్​లో ఏం తింటున్నారు..? ఇవి తింటే డేంజర్​ జోన్​లో పడ్డట్టే! - Which Food best for Dinner

These Foods Dont Eat at Dinner : ఆరోగ్యం బాగుండాలంటే చక్కగా తినాలి. అయితే.. ఏ సమయంలో ఏ ఫుడ్స్ తినాలనేది కూడా తెలిసి ఉండాలి. టైమ్ కానీ టైమ్‍లో తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు రాత్రిపూట అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

These Foods Dont Eat at Dinner
These Foods Dont Eat at Dinner

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 10:58 AM IST

Dont Eat These Foods at Dinner :ఆరోగ్యకరమైన జీవనశైలికి మంచి పోషకాహారం ఎంతో అవసరం. అయితే.. మనం సరైన ఆహారాన్ని సెలక్ట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని సరైన టైమ్​లో తినడం కూడా అంతే ముఖ్యం! అందుకే.. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా తినే ఫుడ్ వేరుగా ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే ఎవరమైనా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుందని చెబుతున్నారు. లేదంటే.. షుగర్, ఊబకాయం వంటి సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి.. రాత్రిపూట అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

గోధుమలు :ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య.. అధిక బరువు. దీన్ని ఎలాగైనా తగ్గించుకోవాలని ప్రయత్నించే వారు.. రాత్రివేళ అన్నం బంద్ చేస్తుంటారు. బదులుగా చపాతీ తింటూ ఉంటారు. కానీ.. చాలా మందికి తెలియని విషయం ఏమంటే.. గోధుమలు త్వరగా జీర్ణం కావు. అంతేకాదు.. ఇవి కడుపులో ఆమ్లం ఉత్పత్తి కూడా చేస్తాయి. దీంతో.. ఆహారం సరిగా జీర్ణం కాక.. కడుపు ఉబ్బరంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ఫలితంగా పొద్దున యాక్టివ్​ నెస్​ ఉండదు. ఇలాంటి పరిస్థితి ఎదురైన వారు రాత్రివేళ చపాతీలు తినకపోవడమే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

మైదా :మనం తినే ఆహారంలో ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువుల జాబితా తయారు చేస్తే.. అందులో మైదా ముందు వరసలో ఉంటుంది. హెల్త్ పరంగా ఇది అంత డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయినప్పటికీ.. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్​ రూపంలో దీన్ని తినేవారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే.. మైదా ఉన్న ఆహారాన్ని రాత్రివేళ తినడం మరింత ప్రమాదకరమని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది. దీనివల్ల షుగర్, అధిక బరువు అతి త్వరగా ఎటాక్ చేస్తాయని చెబుతున్నారు.

Drinking Water Before Sleep : నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా? డాక్టర్లు ఏమంటున్నారు?

పెరుగు :చాలా మందికి భోజనం చివరలో పెరుగు తినడం అలవాటు. అది లేకపోతే.. భోజనం ముగించినట్టుగా ఉండదని అంటారు. కానీ.. రాత్రివేళ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. రాత్రిపూట పెరుగుతో కఫం పెరుగుతుందట. ఇక.. జలుబు, దగ్గుతో బాధపడేవారు రాత్రివేళ పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

స్వీట్స్ : "శరీరానికి చక్కెర పడదు" అని ఒక్క ముక్కలో తేల్చేస్తారు ఆయుర్వేద నిపుణులు. బదులుగా బెల్లం తినాలని సూచిస్తారు. కానీ.. మెజారిటీ జనం చక్కెరనే ఇష్టపడుతుంటారు. దాంతో చేసిన పదార్థాలే తింటారు. కానీ.. చక్కెర జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుందని.. దీనివల్ల హార్ట్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరిస్తున్నారు.

వేపుళ్లు :ఆహారం ఏదైనా సరే.. వేపుడు చేస్తే దాన్ని రాత్రిపూట తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. దీనివల్ల పొట్టలో ఆమ్లం ఉత్పత్తి ఎక్కువై గ్యాస్ వేధిస్తుంది. దీంతో.. పొట్ట ఉబ్బరం సమస్య బాధిస్తుంది. ఇక.. నాన్ వెజ్​ ఫ్రై అయితే.. మరింత ఇబ్బందిగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల రాత్రివేళ వేపుళ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

కాఫీ, టీ : తినడమే కాదు.. రాత్రివేళ కొన్ని తాగడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. కాఫీ, ఛాయ్ రాత్రివేళ తీసుకుంటే.. నిద్రకు ఇబ్బంది ఎదురవుతుంది. ఈ నిద్రలేమి దీర్ఘకాలం కొనసాగితే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి. దాంతోపాటు లేనివారికి గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. ఉన్నవారికి.. మరింత తీవ్రమవుతుంది. కాబట్టి.. వీటికీ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

షుగర్ ఉన్నవారు రాత్రిపూట చపాతీలు తినొచ్చా?

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

ABOUT THE AUTHOR

...view details