తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మూత్రం దుర్వాసన వస్తోందా? - అయితే ఈ ప్రాణాంతక వ్యాధే కారణం కావొచ్చు! - Hyperuricemia

Does Your Pee Smells Bad? : మీరు మూత్రవిసర్జన చేసినప్పుడు యూరిన్ దుర్వాసన వస్తోందా? అయితే అలర్ట్ అవ్వాల్సిందే. అయితే మూత్రం స్మెల్ రావడం సహజమే. అలా కాకుండా విపరీతంగా బ్యాడ్ స్మెల్ వస్తే మాత్రం మీరు సందేహించాల్సిందే. అలా రావడానికి ఈ ప్రాణంతకమైన వ్యాధి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి మీలో కూడా ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Urine
Urine

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 5:27 PM IST

Hyperuricemia Symptoms :మనం ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనే విషయం యూరిన్ ద్వారా అంచనా వేయొచ్చని అందరికీ తెలిసిందే. సాధారణంగా యూరిన్ టెస్ట్ ద్వారా ఎన్నో రకాల వ్యాధులను ఇట్టే తెలుసుకోవచ్చు. అందుకే నిపుణులు.. మూత్రం వాసన వచ్చినా, రంగు మారినా వెంటనే అలర్ట్ అవ్వాలంటారు. జనరల్​గా మూత్రం అప్పుడప్పుడు స్మెల్​ వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో వాష్​రూమ్​కి​ వెళ్లి మూత్రవిసర్జన చేసినప్పుడు భరించలేని దుర్వాసన వస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. మన బాడీలో వాటర్ లెవల్స్ తగ్గి వ్యర్థపదార్థాల విసర్జన పెరిగినా, కాఫీ(Coffee) తాగే అలవాటు ఉన్న వారిలో కూడా యూరిన్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. అయితే మీ యూరిన్ దుర్వాసన రావడానికి ఈ ప్రాణాంతక వ్యాధి కూడా ప్రధాన కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఏంటి ఆ వ్యాధి? దాని లక్షణాలేంటి? ఎవరికి వచ్చే ప్రమాదం ఎక్కువ? నివారణమార్గమేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నిపుణులు సూచించిన ప్రకారం.. మీ యూరిన్ దుర్వాసన రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకుంటున్న ఆ వ్యాధే హైపర్​యూరిసెమియా. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు సాధారణం కంటే అధికంగా పెరగడమే హైపర్​యూరిసెమియా. మన బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్స్ అనే పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పడు ఉత్పత్తి అయ్యే రసాయనం. కొన్ని ఆహారాలలో కనిపించే ఈ ప్యూరిన్స్ శరీరంలో సాధారణంగా తయారవుతాయి.

ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కడైనా ఏర్పడుతుంది. ఎక్కువగా కీళ్లు, మూత్రపిండాల చుట్టూ ఫామ్ అవుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ మూత్రపిండాల వడబోత, మూత్రనాళం ద్వారా బయటకు వెళ్లిపోయే వ్యర్థ పదార్థం. కానీ కిడ్నీలు తమ పనిని సరిగ్గా చేయలేనప్పుడు బాడీలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. అప్పుడు హైపర్​యూరిసెమియా వ్యాధి వస్తుంది. ఇది గౌట్, ఆర్థరైటిస్, కిడ్నీ స్టోన్స్, గుండె జబ్బులు, సకాలంలో చికిత్స తీసుకోనప్పుడు మూత్రపిండాల వైఫల్యం వంటి అనేక వ్యాధులకు దారితీస్తుంది. హైపర్‌యూరిసెమియాతో బాధపడుతున్న వారిలో మూడింట ఒక వంతు మందికి మాత్రమే లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

లక్షణాలు :

  • గౌట్‌ వ్యాధితో బాధపడుతున్నట్లయితే.. కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పేరుకుపోతాయి. ఇది వాపు, కీళ్ల మృదులాస్థి విచ్ఛిన్నానికి కారణమవుతుంది.
  • వీపు దిగువన, పొత్తికడుపు, గజ్జ లేదా కీళ్లలో తీవ్రమైన నొప్పులు.
  • వికారం
  • ముఖ్యంగా కీళ్లలో వాపు
  • వైకల్యం
  • నిరంతరం మూత్ర విసర్జన చేయడం
  • మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది
  • మూత్రంలో రక్తం

హైపర్ యూరిసెమియా ప్రమాదం ఎవరికి ఎక్కువంటే?

  • ఇది స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. వయసుతో పాటు ఈ ప్రమాదం పెరుగుతూనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
  • మద్యం ఎక్కువగా తాగేవారు
  • మందులు వాడేవారు(ముఖ్యంగా గుండె జబ్బులకు మందులు)
  • లీడ్ ఎక్స్పోజర్
  • కిడ్నీ వ్యాధులు
  • అధిక రక్త పోటు
  • అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు
  • హైపోథైరాయిడిజం
  • ఊబకాయం

మీ కిడ్నీలు ఆరోగ్యంగానే ఉన్నాయా? ఇలా తెలుసుకోండి!

హైపర్​యూరిసెమియా చికిత్స పొందండిలా..రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి వైద్యులు కొన్ని ఆహార మార్పులను సిఫార్సు చేస్తున్నారు. అవేంటంటే

వీటికి దూరంగా ఉండాలి :

  • నాన్​వెజ్
  • ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ అధికంగా ఉండే చక్కెర ఆహారాలు, పానీయాలు
  • కాలేయం వంటి అవయవ మాంసం
  • ఆంకోవీస్, సార్డినెస్, స్కాలోప్స్, మస్సెల్స్ వంటి సీఫుడ్
  • ట్యూనా, కాడ్, హెర్రింగ్, హాడాక్ వంటి చేప రకాలు
  • బచ్చలికూర, బఠానీలు, పుట్టగొడుగులు
  • బీన్స్, కాయధాన్యాలు
  • ఓట్​ మీల్
  • గోధుమ బీజ, ఊక
  • బీర్, ఇతర మద్య పానీయాలు
  • ఈస్ట్ సప్లిమెంట్స్

తినాల్సిన ఆహారాలు :

  • పాలు, పాల ఉత్పత్తులు
  • గుడ్లు
  • పాలకూర, టమాటాలు
  • వేరుశెనగ, నట్​ బటర్
  • నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు

అలాగే వీటితో పాటు ఎక్కువ ద్రవాలు తీసుకోమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా నీరు బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు గౌట్ దాడుల నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ సాధారణంగా 8-10 గ్లాసుల వాటర్ తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు.

యూరిక్ యాసిడ్ పెరిగితే కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు.. ఇవి తింటే అంతా సెట్​!

ఈ ఆయుర్వేద చిట్కాలతో మీ కిడ్నీలు సేఫ్​

ABOUT THE AUTHOR

...view details