మనకు బీ విటమిన్లు ఆత్యావశ్యకం. ఇవి కణాలు శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి, అవి ఒకదాంతో మరోకటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవటానికి తోడ్పడతాయి. మన శరీరం జన్యు సంకేతాన్ని చదువు కోవడానికి దోహదం చేస్తాయి. అంతేకాదు.. ఎర్ర రక్తకణాల పుట్టుకురావటంలోనూ, నాడుల మధ్య సమాచారాన్ని చేరవేయటం లోనూ, కీలక పాత్ర పోషిస్తాయి. అయితే బీ విటమిన్లు నీళ్లలో కరిగిపోతాయి.
మీ ఆహారంలో 'బీ' ఉందా? - విటమిన్ బి కాంప్లెక్స్
కణాలు శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి, అవి ఒకదాంతో మరోకటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవటానికి బీ విటమిన్లు తోడ్పడతాయి. ఎర్ర రక్తకణాల పుట్టుకురావటంలోనూ, నాడుల మధ్య సమాచారాన్ని చేరవేయటం లోనూ, కీలక పాత్ర పోషిస్తాయి. బీ12 విటమిన్ మాత్రం జంతు సంబంధ ఆహారం ద్వారానే లభిస్తుంది. కాబట్టి శాఖాహారులు బీ12 మాత్రలను తీసుకోవడం ద్వారా దీని లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.
![మీ ఆహారంలో 'బీ' ఉందా? b vitamin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12018002-thumbnail-3x2-iii.jpg)
బి విటమిన్
వీటిని శరీరం నిల్వ ఉంచుకోలేదు. అందువల్ల ఆహారం ద్వారా నిరంతరం అందుకునేలా చూసుకోవడం తప్ప మరో మార్గం లేదు. చిక్కుళ్లు, పప్పులు, పొట్టుతీయని ధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో.. ముఖ్యంగా ఆకుకూరల్లో బీ విటమిన్లు దండిగా ఉంటాయి. అయితే బీ12 విటమిన్ మాత్రం జంతు సంబంధ ఆహారం ద్వారానే లభిస్తుంది. కాబట్టి శాఖాహారులు బీ12 మాత్రలను తీసుకోవడం ద్వారా దీని లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.