యక్తవయసు రాగానే శరీరంలో మార్పులు రావటం సహజమైన ప్రక్రియ. ఆడవారైతే.. వక్షోజాలు పెరిగి, రజస్వల అయ్యి.. వయసుతో పాటు వచ్చే పరువాలతో (women climax signs) ఆకర్షణీయంగా మారుతారు. మగవారు కూడా అనేక మార్పులతో దేహదారుఢ్యంతో ఆకట్టుకుంటారు. ఆ వయసులోనే ముఖంపై మొటిమలు కూడా పుట్టుకొస్తాయి. మరి మొటిమలు శృంగార వాంఛలకు సంకేతాలా? మొటిమలు ఎక్కువగా (Pimple Reason) ఉన్నవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయా?
మొటిమలు ఉన్న స్త్రీలకు శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయా? - డాక్టర్ సమరం
యుక్తవయసు వచ్చినప్పటి నుంచి శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. క్రమంగా శృంగార వాంఛలు దరిచేరుతాయి. ఆ వయసులోనే ముఖంపై మొటిమలు కూడా పుట్టుకొస్తాయి. మరి మొటిమలు ఎక్కువగా ఉన్నవారిలో శృంగార వాంఛలు ఎక్కువగా ఉంటాయా?
మొటిమలు ఉన్న స్త్రీలకు శృంగార కోరికలు
వాస్తవానికి మొటిమలకు సెక్స్ కోరికలకు సంబంధం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ హార్మోన్లు శరీరంలో ఉత్పత్తి అవడం వల్ల కొన్ని గ్రంథులు ప్రతిస్పందిస్తాయి. మొటిమల రూపంలో అవి కనిపిస్తాయి. అయితే.. చాలా మందిలో కొద్దిపాటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి వల్లనే ముఖంపై ఉన్న గ్లాండ్స్ ప్రతిస్పందించి ఉబ్బుతాయి. అవి మొటిమలుగా కనిపిస్తాయి. అంతేతప్పా ముఖంపై మొటిమలకు సెక్స్‌కు సంబంధం ఉండదు.
ఇదీ చదవండి:శృంగార జీవితంలో సుఖప్రాప్తి ఎప్పుడంటే?