ఇటీవల కాలంలో యువత మేకప్ వేసుకునేందుకు ఎక్కువ ఆసక్తిని చూపుతోంది. చిన్నవారి నుంచి పెద్దవారు కూడా అందంగా ఉండేందుకు చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. అయితే చాలా మందిలో మేకప్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందా అనే అనుమానం ఉంది. దీని గురించి నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. వీటితో పాటు మేకప్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను తెలిపారు. అవేంటంటే?..
- మేకప్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. ఇంతకు ముందు మేకప్ బాక్స్‌లలో అమోనియా వంటి చర్మానికి హానికలిగించే కెమికల్స్ వాడేవారు. ఇప్పుడైతే అలాంటి ప్రమాదకరమైన రసాయనాల్ని నిషేధించారు.
- చవకబారు మేకప్ బాక్స్, క్రీమ్స్ వాడటం మంచిది కాదు. మంచి బ్రాండ్ల నుంచి ప్రొడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం.
- చర్మానికి వాడే ఏ ప్రొడక్ట్స్ వల్లనైనా అప్పుడప్పుడూ కొన్ని స్కిన్ అలర్జీస్ వస్తాయి. అయితే అవి క్యాన్సర్‌కు దారితీస్తాయని భయపడాల్సిన అవసరం లేదు.
- మేకప్, కాస్మొటిక్స్ క్రీమ్స్ వాడుతున్నవారు అది వారి చర్మానికి సూట్ అవుతుందో లేదో అని స్కిన్ టెస్ట్ చేసి చూసుకోవాలి. ఈ టెస్ట్ చేసేటప్పుడు వారి చర్మం ఎర్రగా మారి రాషెస్ వస్తే వెంటనే అలాంటి ఉత్పత్తులను వాడటం మానేయటం ఉత్తమం.
- మేకప్‌ను సరైన పద్ధతిలో తీసేయాలి. అయితే తరచుగా మేకప్ వేసుకోకుండా, ఏదైనా తప్పనిసరి పరిస్థితులలో అప్పుడప్పుడు మాత్రమే మేకప్ వేసుకుంటే మంచిది.
- నాణ్యమైన ఉత్పత్తులు వాడకపోయినా పర్లేదు కానీ, గడువు దాటినవి వాడకపోతే మంచిది. వీటివల్ల స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- మేకప్ వేసుకుని చర్మంపై ఎక్కువసేపు ఉంచటం మంచిది కాదు. మేకప్‌ను తొందరగా తొలగించేయాలి.
- ముఖ్యంగా రాత్రులు పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేసుకోవటం తప్పనిసరిగా భావించాలి. లేదంటే చర్మ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
- వీలైనంత తక్కువగా మేకప్ వేసుకోవటం ఉత్తమం.
- నాణ్యమైన మేకప్ ఉత్పత్తులను.. పరిశుభ్రమైన పద్ధతులలో వాడటం మంచిది.
- మేకప్ ద్వారా వచ్చే అందం కంటే సహజసిద్ధంగా వచ్చే సౌందర్యమే శాశ్వతం. కొన్ని చిట్కాలను పాటిస్తే సహజసిద్ధంగా చర్మం నిగారిస్తుంది.