శృంగారంలో పాల్గొనడం ప్రత్యేక అనుభూతి. కానీ అది ఎక్కువైతే ఆయుష్షు క్షీణిస్తుందనేది చాలా మంది భావన. పురుషులతో పాటు మహిళలలో ఈ సందేహం ఉంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది కేవలం అపోహే అని స్పష్టం చేశారు.
అతిగా శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు క్షీణిస్తుందా? - శృంగారం వల్ల సైడ్ ఎఫెక్ట్స్
సెక్స్‌లో పాల్గొనడంపై మహిళలు, పురుషుల్లో కూడా వివిధ రకాల అపోహలు ఉంటాయి. ఆయువు క్షీణత అనేది అందులో ఓ రకం. అతిగా శృంగారంలో పాల్గొంటే ఆయువు క్షీణిస్తుందని భావిస్తుంటారు. మరి దీనిపై నిపుణుల మాటేమిటి?
అతిగా శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు క్షీణిస్తుందా?
నిజానికి సెక్స్‌లో ఎక్కువగా పాల్గొనే వారికి ఆరోగ్యం బాగుంటుందని.. ఆయుష్షు ఇంకా పెరుగుతుందని సూచిస్తున్నారు. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు విడుదలయ్యే ఫీల్‌గుడ్ హార్మోన్సే అందుకు కారణని పేర్కొన్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి రక్షణగా నిలిచే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. కాబట్టీ సెక్స్ అనేది ఆరోగ్యానికి అత్యంత అవసరమైనదని.. దీని వల్ల లాభమే కానీ నష్టం కలగదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :కలయికను ఆస్వాదించలేకపోతున్నారా.. కారణం ఇదే కావచ్చు?