తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మాయిశ్చరైజర్​తో చర్మం జిడ్డుగా మారుతోందా?.. ఈ నిపుణుల సలహాలు మీకోసమే! - పింపుల్ క్రీమ్స్ ఎలా వాడాలి

చలికాలంలో చర్మం పొడిబారడం సహజం. అయితే, మాయిశ్చరైజర్లు వాడితే కొందరికి చర్మం జిడ్డుగా మారిపోతుంటుంది. ఇక ఆయిల్ స్కిన్ ఉన్నవారికైతే.. మాయిశ్చరైజర్ల వల్ల మొటిమల సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

Does Moisturizer Make The Skin Oily
Does Moisturizer Make The Skin Oily

By

Published : Oct 29, 2022, 12:41 PM IST

చలికాలంలో చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల చర్మం పొడిబారుతూ ఉంటుంది. అయితే, ఇందుకు విరుగుడుగా చాలా మంది మాయిశ్చరైజర్లు వాడుతుంటారు. దీని వల్ల చర్మం పొడిబారే సమస్య దూరమైనా.. మరో చిక్కొచ్చి పడుతుంది. కొందరికి మాయిశ్చరైజర్ల వల్ల చర్మం జిడ్డుగా మారుతుంది. మొటిమలు సైతం వస్తుంటాయి. అలాగని డ్రై స్కిన్ ఉన్న వారిలో ఉండవని కాదు. కానీ ఎక్కువగా ఈ సమస్యలు ఆయిల్ స్కిన్ వారిలో కనిపిస్తాయి. అయితే ఈ మొటిమల నివారణకు జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడమని చర్మ సంబంధిత వైద్యులు సలహా ఇస్తున్నారు. వీటిని వాడటం వల్ల మాయిశ్చరైజర్ మన చర్మంలోనికి ఇంకిపోయి జిడ్డు దూరమయ్యేందుకు తోడ్పడుతుంది. అయితే డ్రై స్కిన్ ఉన్న వారిలో మొటిమల నివారణకు లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే లాభం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్​ అప్లై చేసి దానిపై పింపుల్ క్రీం వాడితే స్కిన్ డ్రై అవ్వకుండా పింపుల్స్ సమస్య క్లియర్ అవుతుందని సూచిస్తున్నారు.

అయితే ఈ పింపుల్ క్రీమ్స్ స్కిన్​పై అప్లై చేసి ఎంతసేపు ఉంచాలి అనే ఆలోచన అందరిలో వస్తుంది. సాధారణంగా ఆయిల్ స్కిన్ వారయితే ఈ పింపుల్ క్రీమ్స్ అప్లై చేసి రాత్రంతా ఉంచాలి. అదే డ్రై స్కిన్ వారిలో అయితే పింపుల్ క్రీమ్స్ అప్లై చేసే ముందు కచ్చితంగా మాయిశ్చరైజర్ వాడటం మంచిది. అయితే డ్రై స్కిన్ వారు ఈ పింపుల్​ క్రీమ్స్​ను స్కిన్​పై అప్లై చేసి ఎక్కువ సేపు ఉంచకూడదు. వీరు ఈ క్రీమ్స్​ను స్కిన్​పై అప్లై చేసిన 3 నుంచి 4 గంటల సమయం తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. సమస్య ఇంకా తీవ్రంగా ఉంటే డోసేజ్ సమయాన్ని ఒకేసారి కాకుండా నిదానంగా పెంచుకుంటూ పోవచ్చు. లేకుంటే వీరి చర్మం మరింత పొడిబారి, మంట , మచ్చలు లాంటి సమస్యలు తలెత్తవచ్చు. మీ చర్మ సమస్యలు ఇంకా తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

ABOUT THE AUTHOR

...view details