శీతాకాలంలో ఎక్కువగా చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. వీటి వల్ల చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమందిలో అయితే మెడపై రాషెస్ వస్తాయి. మెడపై బంగారం లేదా మరేవైనా ఆభరణాలను వేసుకోవటం వలనే రాషెస్ వస్తున్నాయి అనుకుంటారు. అయితే ఇది ఎంత వరకు నిజం అనే విషయంపై నిపుణులు స్పష్టత ఇచ్చారు. మెడపై రాషెస్ రావటానికి గల కారణాలను, సమస్య పరిష్కార మార్గాలను కూడా తెలిపారు. అవేంటంటే..
మెడపై రాషెస్ రావటానికి గల కారణాలు:
- సాధారణంగా మెడపై ఎక్కువ చెమట పట్టడం వల్ల రాషెస్ వస్తాయి.
- ఎండ కారణంగా కూడా మెడ చర్మంపై దద్దుర్లు వస్తాయి.
- అయితే మెడలో వేసుకున్న గోల్డ్ చైన్ మందంగా ఉంటే చెమట ఎక్కువగా పట్టడం వల్ల రేషెస్ మరింత ఎక్కువవుతాయి.
- మెడపై ఎక్కువగా ఎండ తగలడం వలన స్కిన్‌పై దద్దుర్లు వస్తాయి.
- మెడపై మందంగా ఉన్న ఆభరణాలను ఎక్కువగా వేసుకోవటం వల్ల రాషెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ఒకవేళ మెడపై దురద ఉంటే అది ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావచ్చు.
- ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
- కొన్ని రకాల కీటకాలు మెడపై కుట్టటం వల్ల రాషెస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
- శరీరానికి పడని ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా మెడపై రాషెస్ రావచ్చు.
- కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా మెడపై రాషెస్ రావచ్చు. వాడిన మందులు దుష్ప్రభావం చూపడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి.
- అధిక వేడిమి వల్ల కూడా మెడపై దద్దుర్లు వస్తాయి.
- ఈ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డెర్మటాలజిస్టును సంప్రదించటం ఉత్తమం.