తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కడుపులో గ్యాస్ ఉంటే సెక్స్ తగ్గిపోతుందా? - sex problems in women

Does gas Hurt sex: కడుపులో గ్యాస్ ఉంటే ఏ పనీ సౌకర్యవంతంగా చేయలేరు. ఈ సమస్య సెక్స్​పైనా ప్రభావం చూపుతుందా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.

Does gas Hurt sex
gas trouble

By

Published : May 4, 2022, 7:35 AM IST

Does gas Hurt sex: శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే సెక్స్​ను ఆస్వాదించగలరు అనేది నిపుణుల మాట. మరి కడుపులో ఉబ్బరం, గ్యాస్​ లాంటివి ఉన్నప్పుడు.. అది సెక్స్​పై ఏమేర ప్రభావం చూపుతుంది? ఈ బాధ సెక్స్​ను డౌన్ చేస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

"కడుపులో గ్యాస్ ఉన్నప్పుడు.. అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా, పేగులు కదులుతున్నట్లు ఉంటుంది. చిరాకు ఎక్కువవుతుంది. ఒకటికి నాలుగు సార్లు విరేచనాలు వస్తున్నట్లు అనిపిస్తుంది. వికారంగా, తేన్పులు వస్తున్నట్లు తోస్తుంది. ఎప్పుడైతే అసౌకర్యంగా ఉంటారో.. అప్పుడు కచ్చితంగా సెక్స్​ డౌన్ అవుతుంది. సెక్స్ కోరిక సరిగ్గా ఉండదు. రతిలో పాల్గొనాలంటే మనిషి హుషారుగా ఉండాలి. మనసులో ఏ బాధా, దిగులు, చింతా లేకుండా ఉండాలి. అప్పుడే సెక్స్​ బాగా జరుగుతుంది. కడుపు ఉబ్బరంగా, కడుపులో గ్యాస్ ఉన్నవారిలో ఆ బాధ వలన సెక్స్​ అణచివేతకు గురవుతుంది. ఏ బాధైనా సరే మనిషిలో సెక్స్​ను డౌన్ చేస్తుంది." అని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:మగవారిలో సెక్స్​ బలహీనతకు అదే ప్రధాన కారణమా?

ABOUT THE AUTHOR

...view details