Do not Put These Items in Fridge :ప్రస్తుత రోజుల్లో రిఫ్రిజిరేటర్ల వాడకం సర్వసాధారణమైంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో ఫ్రిజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వండిన ఆహార పదార్థాలు పాడవ్వకుండా, కూరగాయలు, ఇతర పదార్థాలు ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేందుకు ఫ్రిజ్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే.. వీటి వినియోగం, మెయింటెనెన్స్‌పై మాత్రం ప్రజలకు అవగాహన ఉండట్లేదు. వండిన పదార్థాలు వేస్ట్ అవ్వకూడదంటూ ఫ్రిజ్‌లో పెడతారు కానీ.. ఎలాంటి ఆహారాలు ఫ్రిజ్‌లో పెట్టాలి? వేటిని పెట్టకూడదు? అనేది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈ నాలుగు ఆహార పదార్థాలను ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
అలర్ట్ - ఈ తప్పులు చేస్తే మీ ఫ్రిజ్ పేలిపోతుంది!
ఉల్లిపాయ(Onion):ఆనియన్స్‌ను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఒకవేళ ఫ్రిజ్‌లో వీటిని స్టోర్ చేస్తే.. ఉల్లిపాయలోని పిండి పదార్ధం చక్కెరగా మారుతుంది. దీంతో వాటికి త్వరగా బూజు పడుతుంది. చాలా మంది ఉల్లిపాయను కోసి సగాన్ని వంటల్లో వాడతారు. మిగిలిన సగం భాగాన్ని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే.. ఇవి అనారోగ్యకరమైన బ్యాక్టీరియాను ఆకర్షించి పాడవుతాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వెల్లుల్లి(Garlic): ఒలిచిన వెల్లుల్లిని మార్కెట్ల నుంచి అసలు కొనుగోలు చేయకూడదు. అలాగే.. వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఒలిచిన వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడితే.. వాటిపై మచ్చలు, బూజు త్వరగా ఏర్పడి చెడిపోతాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా మారి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే.. వెల్లుల్లిని గడ్డలుగానే కిచెన్‌లో పెట్టాలి. అవసరమైనప్పుడే వాటిని ఒలిచి, వెంటనే వంటల్లో వాడాలి.