Do n0t Eat These Foods in Breakfast: మార్నింగ్ టైమ్‌లో ఉత్సాహంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట సరైన మోతాదులో ప్రొటీన్లు, విటమిన్లు, పీచుపదార్థాలు, కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం అవసరం. అయితే చాలా మంది నచ్చింది తింటున్నారు. దాంతోపాటు ఇంట్లో చేసుకునే ఓపిక లేక.. బయట ఏది కనిపిస్తే దానిని పొట్టలోకి వేస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్ ముప్పు కూడా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
డీప్ ఫ్రై ఫుడ్స్:చాలా మంది తమ బ్రేక్‌ఫాస్ట్‌లో ఆయిల్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. అంటే పూరి, వడ, బొండా.. ఇలా మొదలైనవి. అయితే ఉదయం పూట వీటిని తినడం వల్ల మెటబాలిజం తగ్గిపోతుంది. అలాగే హెవీగా ఉండి.. నడవడానికి కూడా చాలా కష్టపడతాం. అంతే కాకుండా చాలా మంది బయట హోటల్స్, మొబైల్ క్యాంటీన్ల దగ్గర తినడానికి ఇష్టపడతారు. అయితే వాళ్లు వాడిన ఆయిల్‌ను.. పదేపదే ఉపయోగిస్తారు. అలాంటి నూనెలతో చేసిన ఫుడ్స్ తినడం వల్ల హార్ట్ ఎటాక్స్, ఫ్యాటీ లివర్ సమస్య, షుగర్, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీకు అంతగా తినాలనిపిస్తే.. ఎప్పుడో ఒకసారి ఇంట్లోనే తయారు చేసుకోవడం బెటర్.
రెడ్ రైస్ గురించి మీకు తెలుసా? - అంత మంచిదా?
న్యూటెలా:న్యూటెలాను బ్రెడ్, రోటీ, దోశ మీద స్ప్రెడ్ చేసుకుని చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లాగా తింటుంటారు. అదే కాకుండా జామ్ కూడా తింటారు. అయితే అవి ఎక్కువగా షుగర్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి నష్టమే కానీ.. లాభం ఏ మాత్రం ఉండదు. అయితే చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట.. "మా పిల్లలు జామ్ లేనిది తినరు" అని. ఒకవేళ మీ పిల్లలు అంతగా జామ్ ఇష్టపడితే.. ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసుకోండి. దీనివల్ల ఆరోగ్యం కలిసివస్తుంది.
పెరుగు Vs మజ్జిగ - ఏది ఆరోగ్యానికి మంచిది?
రెడీ టూ ఈట్ ఫుడ్స్: బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా ఇంట్లో చేసుకునే తీరిక లేక.. నిమిషాల్లో రెడీ అయ్యే ఫుడ్స్‌పై ఆధారపడుతున్నాం.. అయితే ఇందులో ఎక్కువ మంది ఉప్మా, పోహాలను ఎక్కువ వాడుతుంటారు. అయితే వీటిలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ. 60 గ్రాముల పోహా ప్యాకెట్లో కేవలం 1.5 గ్రాములు ఫైబర్ మాత్రమే ఉంటుందట! అది మ్యాగీతో సమానం. కాబట్టి రెడీ టూ ఈట్ మీల్స్(ఉప్మా, దోశ,పోహా) వల్ల ఆరోగ్యంగా ఉంటామనే ప్రకటనలను నమ్మకుండా.. కొంచెం కష్టమైనా సరే ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్..