తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బీకేర్​ఫుల్ : ఈ ఆహార పదార్థాలు తిన్న తర్వాత అస్సలు నీరు తాగకండి! - లేదంటే ప్రాణాలకే ప్రమాదం! - Never Drinking Water after Meals

Never Drinking Water After These Foods : మీకు ఏదైనా తిన్న తర్వాత వెంటనే వాటర్ తాగే అలవాటు ఉందా? అయితే ఇది మీకోసమే. ఎక్కువ మందికి ఈ హ్యాబిట్ ఉండి ఉంటది. కానీ, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్న తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచి నీరు తాగకూడదంట. అలా తాగితే పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేటి తర్వాత తాగకూడదో ఇప్పుడు చూద్దాం..

Drinking Water
Drinking Water

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 2:08 PM IST

Do Not Drink Water After These Foods Eating :మనం జీవించడానికి నీరు చాలా అవసరం. అవసరమైతే కొన్నిరోజులు అన్నం తినకుండైనా ఉంటామేమో కానీ.. మంచినీరు తాగకుండా అస్సలు ఉండలేము. ఎందుకంటే మన బాడీలోని అన్నీ వ్యవస్థలు సరిగ్గా పనిచేయడంలో డ్రింకింగ్ వాటర్ ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ నిర్వహణలో దీని పాత్ర చాలా కీలకం. డైలీ తగినంత మొత్తంలో నీరు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతుంటారు. అయితే మనం ఎప్పుడూ నీరు(Water) తాగాలనే విషయంలో ఆయుర్వేదంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఇకపోతే కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలు తిన్న తర్వాత మాత్రం అస్సలు నీరు తాగకూడదట. అలా తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు మీరు కొనితెచ్చుకున్నట్టే. ఇంతకీ ఏవి తిన్నాక వాటర్ తీసుకోకకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అన్నం : మనలో చాలా మందికి భోజనానికి ముందు గానీ.. తినేటప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇంట్లో పెద్దలు కూడా అప్పుడప్పుడు ఈ విషయాన్ని చెబుతుంటారు. కానీ, అలా తాగడం ఆరోగ్యకరమైన అలవాటు కాదంట. అందుకు ప్రధాన కారణం జీర్ణక్రియను దెబ్బతీయడం. ఆ టైమ్​లో నీరు తాగడం వల్ల మనం తీసుకునే వేగంగా పేగుల్లోకి చేరుకుంటుంది. దాంతో జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి అన్నం తిన్న తర్వాత కనీసం పావుగంట గ్యాప్ ఇచ్చి వాటర్ తాగితే బెటర్.

పెరుగు :చాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటారు. ఇది హెల్త్​కు కూడా మంచిదని నిపుణులు చెబుతుంటారు. అలాగే దీనిలో ప్రోబయోటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణక్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. కానీ పెరుగు తిన్న వెంటనే నీరు తాగడం మంచిది కాదంటున్నారు కొందరు నిపుణులు. ఎందుకంటే ఇది తిన్న వెంటనే వాటర్ తాగడం వల్ల దీనిలో ఉండే ప్రోబయోటిక్ కంటెంట్ వేస్ట్ అవుతుంది. కాబట్టి కనీసం పెరుగు తిన్నాక 30 నిమిషాల గ్యాప్ ఇవ్వండి. కొంచం సమయం ఇవ్వడం ద్వారా ప్రోబయోటిక్స్ బాడీలోకి చేరుతాయి. ఇది ఇమ్యూనిటీ పవర్​ను కూడా పెంచుతుంది.

నిమ్మజాతి పండ్లు : సిట్రస్ జాతి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వైద్యులు కూడా వీటిని ఎక్కువగా తీసుకోమని సలహా ఇస్తుంటారు. అలాగే నారింజ, ద్రాక్ష వంటి వాటిలో ఫైబర్ అనే పోషకపదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని తిన్న తర్వాత వెంటనే వాటర్ తీసుకోవల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా కాదని వీటిని తిన్నాక మంచి నీరు తాగారంటే.. ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్, అజీర్తి లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని తిన్నాక కనీసం వన్​ అవర్ తర్వాత వాటర్ తీసుకోవడం హెల్త్​కు చాలా మంచిది. ఆ గ్యాప్​లో పండ్లలో ఉండే పోషకాలు మీ బాడీలోకి చేరుతాయి.

గోరువెచ్చని నీరు తాగే అలవాటుందా? లేదా? - అయితే తప్పకుండా చదవండి!

అరటి పండు : మీరు ఎక్కువగా తినే పండ్లలో అరటిపండు ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనిలోనూ ఫైబర్ ఉంటుంది. కాబట్టి బనానా తిన్నాక వాటర్ తాగకపోవడం బెటర్. ఒకవేళ అరటిపండు తిని తాగరనుకో అజీర్తి సమస్య రావడంతో పాటు జీర్ణక్రియ మందగిస్తుంది. ఒక్కోసారి దీని వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కడుపు నొప్పి కూడా రావచ్చు. అందుకే అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగడం మానుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు.

మసాలా ఫుడ్స్ :చాలా మంది బిర్యానీ, ఫాస్ట్​ఫుడ్ లాంటి మసాలా ఫుడ్స్ తింటున్నప్పుడు వాటర్ తాగుతుంటారు. కానీ అలా తాగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే మసాలా కలిసిన ఆహార పదార్థాలు తిని నీళ్లు తాగితే కడుపులో మంటగా అనిపిస్తుంది. అవసరమైతే వాటర్​కు బదులుగా మజ్జిగ తీసుకోవడం ఉత్తమం. ఇలా పైన పేర్కొన్ని పదార్థాలు తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ తాగడానికి ట్రై చేయకండి. వీలైనంత వరకు కొద్ది సమయం వెయిట్ చేయండి. ఇక తప్పరిసరి పరిస్థితుల్లో తాగాలనుకుంటే కొన్ని వాటర్ మాత్రమే తీసుకోండి.

చలికాలంలో చన్నీటి స్నానం చేస్తున్నారా! ఈ ప్రమాదాలు తెలుసా?

జనరేషన్​ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details