Digestion Problem Solution In Telugu : నేటి ఆధునిక జీవనశైలి వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో ప్రధానమైనది అజీర్తి సమస్య. చాలా మంది తాము తిన్న ఆహారం జీర్ణంకాక.. అవస్థలు పడుతుంటారు. ఇంతకీ ఈ సమస్యకు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- జీవనశైలిలో మార్పు :నేటి ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలిలో చాలా ఊహించని మార్పులు వచ్చేశాయి. వేళాపాలా లేకుండా తినడం, జంక్ ఫుడ్ అతిగా తీసుకోవడం, బాగా నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థ దెబ్బతినడానికి కారణాలు అవుతున్నాయి.
- ధూమపానం, మద్యపానం : యువత ఫ్యాషన్ పేరుతో ఎక్కువగా ధూమపానం, మద్యపానం చేస్తుంటారు. దీని వల్ల కచ్చితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
- మసాలా పదార్థాలు : ఈనాటి యువత ఎక్కువగా మసాలా వేసిన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాగే అతిగా కారంగా (స్పైసీ) ఉన్న పదార్థాలు తీసుకుంటున్నారు. ఇది కూడా జీర్ణప్రక్రియకు ఇబ్బందిగా మారుతోంది.
- ఫాస్ట్ ఫుడ్ :నేటి యువత వేళాపాలా లేకుండా.. ఫాస్ట్ఫుడ్ సెంటర్లకు వెళ్లి తినడం అలవాటుగా మార్చుకున్నారు. వాస్తవానికి చాలా అపరిశుభ్రమైన పరిసరాల్లో, ఏ మాత్రం సుచీశుభ్రత లేని ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ఈ అలవాటు ఆరోగ్యాన్ని, ముఖ్యంగా జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.
- కూల్ డ్రింగ్స్, ఐస్క్రీమ్స్ : అతి చల్లగా ఉండే పానీయాలు, ఐస్క్రీమ్స్ తినడం వల్ల కూడా జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి.
జీర్ణ వ్యవస్థ బాగుండాలంటే ఏం చేయాలి?
How To Improve Digestion :
1. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి.
2. వేళకు భోజనం చేయాలి. ఉదయం 8 నుంచి 9లోపు అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటలలోగా ఆహారం తీసుకోవాలి. ఆలస్యంగా తింటే సరిగ్గా ఆహారం జీర్ణం కాదు.
3. రాత్రి 8 గంటల్లోపే భోజనం చేసేయాలి. తరువాత వెంటనే పడుకోకుండా.. కాసేపు అటూఇటూ నడవాలి. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మంచి నిద్ర కూడా పడుతుంది.
4. కొంత మంది పనిలోపడి భోజనం మానేస్తుంటారు. మరికొందరు బరువు తగ్గాలని తినకుండా ఉండిపోతూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం సరైన పనికాదు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.