- మధుమేహాన్ని నియంత్రించే మెంతుల టీని ముఖాన్ని మెరిపించడానికీ వాడొచ్చు. స్పూను మెంతిగింజల్ని పావులీటరు నీటిలో వేసి మరిగించాలి. దానికి నాలుగైదు తులసి ఆకులు కూడా జతచేయాలి. చివర్లో చెంచా తేనె కలపాలి. ఈ టీని తాగడంతో పాటు ముఖానికీ రాసుకోవచ్చు. ఇది చర్మాన్ని తాజాగా, తేమగా ఉండేలా చేస్తుంది. మొటిమల్ని అదుపులో ఉంచుతుంది.
- చామంతి టీ: ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టిన చామంతి పూల మొగ్గలు మార్కెట్‌లో దొరుకుతాయి. వీటిని నీళ్లలో వేసి మరిగించాలి. చల్లారాక దీనికి కాస్త తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కళ్లకింద నలుపు తగ్గుతుంది. చర్మం ఛాయ మెరుగవుతుంది.
- నిమ్మచెక్కను సన్నగా కోసి రెండు కప్పుల నీళ్లల్లో వేసి మరిగించండి. దీనికి చెంచా బెల్లం, కొద్దిగా తేనె, గుప్పెడు గులాబీరేకల్ని జతచేయండి. ఈ మిశ్రమంతో రోజూ ముఖం శుభ్రం చేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ తొలగిపోతుంది. మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
ఈ ఛాయ్‌లు మీ మోముకు చక్కని అందాన్నిస్తాయి! - face beauty tips with tea
ఆరోగ్యం కోసం గ్రీన్‌టీ, లెమన్‌టీ, చామంతి, గులాబీ...అంటూ చాలా రకాల టీలని తాగుతుంటాం.మరి వీటిని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికీ ఉపయోగించొచ్చు అదెలాగంటే..
ఈ ఛాయ్‌లు మీ మోముకు చక్కని అందాన్నిస్తాయి!