తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ టీలు తాగితే.. హాయిగా నిద్రపట్టేస్తుంది! - rose tea helps for good sleep

టీ... మనలో చాలామందికి దీన్ని తాగితేనే రోజు మొదలవుతుంది. ఓ కప్పు తాగితే నూతనోత్తేజం వచ్చేస్తుంది. సాధారణమైన టీలోనే ఇంతటి మహత్తు ఉంటే ఔషధ గుణాలున్న టీలు కలిగించే లాభాలెన్నో కదా...

tea, mint tea, rose tea
టీ, పుదీనా టీ, గులాబీ టీ

By

Published : May 22, 2021, 10:18 AM IST

పుదీనా టీ

పుదీనా... కప్పు నీటిలో నాలుగైదు పుదీనా ఆకులు వేసి మరిగించి, వడకట్టాలి. కాస్తంత తేనె కలిపి తాగి చూడండి. వేసవి గంజిలో కాస్త పల్చటి మజ్జిగ, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే డీహైడ్రేషన్‌ సమస్య ఉండదు. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. శరీరం, మెదడు, ప్రశాంతంగా మారతాయి. ఇది జీర్ణవ్యవస్థకూ సాంత్వన కలిగించి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.

గులాబీ టీ

గులాబీ టీ... ఈ పూలలోని తియ్యటి పరిమళాలు మీలోని ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. తాజా/ఎండిన గులాబీ రేకలను నీటిలో మరిగించి గ్లాసులోకి వడ కట్టుకోవాలి. కాస్తంత తేనె కలిపి తాగితే సరి. చక్కగా నిద్ర పడుతుంది.

ABOUT THE AUTHOR

...view details