White Rice and Brown Rice Differences :సాధారణంగా ప్రతి ఇంట్లో వైట్ రైస్ వండుతారు. తెల్లటి బియ్యాన్ని.. బ్రౌన్ రైస్ కంటే ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో ఇది కొన్ని పోషకాలను కోల్పోతుంది కూడా. వైట్ రైస్‌లో పోషకాలు తక్కువ ఉండవచ్చు కానీ శక్తి మాత్రం పుష్కలంగా ఉంటుంది. మరి వీటి ప్రయోజనాలు ఏంటంటే..?
ఆరోగ్య ప్రయోజనాలు:
- త్వరిత శక్తి వనరు: వైట్ రైస్ అధిక కార్బోహైడ్రేట్ ఆహారం. ఇది త్వరగా, సులభంగా జీర్ణమయ్యే శక్తి వనరుగా మారుతుంది. అథ్లెట్లు లేదా తొందరగా శక్తి అవసరమయ్యే వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
- జీర్ణవ్యవస్థపై సున్నితంగా:వైట్ రైస్‌ను ప్రాసెసింగ్ చేసే సమయంలో బయటి ఊక పొరను తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై సున్నితంగా పని చేస్తుంది. ఇది జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులకు లేదా అనారోగ్యాల నుంచి కోలుకుంటున్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
- కొవ్వు తక్కువగా ఉంటుంది:వైట్ రైస్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది.
- తక్కువ ఫైటిక్ ఆమ్లం: రైస్‌ను పాలిష్ చేయడం వల్ల అందులో ఉన్న ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది.
జనరేషన్ గ్యాప్ గురూ - ఆరోగ్యానికి గంజి అమృతమని మీకు తెలుసా! - ఆ సమస్యలన్నీ దూరం!
బ్రౌన్ రైస్ :బ్రౌన్ రైస్ అంటే ధాన్యం నుంచి పొట్టును వేరు చేసిన తర్వాత ఉండే బియ్యమే. ఇవి బ్రౌన్ కలర్‌లో ఉండటం వల్ల బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. బియ్యాన్ని పూర్తిగా పాలిష్ చేయనప్పుడు ఇదే రంగులో ఉంటుంది. పూర్తిగా శుభ్రం చేస్తే తెలుపు రంగులో ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రాసెస్ చేయని బియ్యం కాబట్టి.. ఇందులో న్యూట్రియంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి.
బ్రౌన్ రైస్ ఆరోగ్య ప్రయోజనాలు
- ఫైబర్ అధికం: బ్రౌన్ రైస్‌లో పుష్కలంగా లభించే పోషక పదార్ధాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఇందులో లభించే ఫైబర్ గుండె సంబంధిత వ్యాధులు, ముప్పును తగ్గిస్తాయి. ఇందులో లిగ్నాన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును తగ్గిస్తుంది. బరువు తగ్గుదలకు కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. "యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. బ్రౌన్ రైస్ తినడం గుండె ఆరోగ్యానికి దోహదపడుతుందట.
- పోషకాలు:మాంగనీస్, సెలీనియం, మెగ్నీషియం, బి విటమిన్ వంటి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఎముకల అభివృద్ధి, రోగనిరోధక శక్తి, జీవక్రియను పెంచుతుంది.
- యాంటీ ఆక్సిడెంట్: బ్రౌన్ రైస్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. సెల్యులార్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.