తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మధుమేహంతో వచ్చే పాదాల సమస్యలు.. తగ్గేదెలా? - diabetes symptoms

Diabetes Problems On Foots: ఆధునిక ప్రపంచంలో మధుమేహం(షుగర్​) అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఈ వ్యాధి ఉన్న వారిలో పాదాలకు వచ్చే సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

Diabetes Problems On Foot
మధుమేహం పాదాల సమస్యలు

By

Published : Mar 14, 2022, 7:13 PM IST

Diabetes Problems On Foots: చిన్న వయసు వారి నుంచి పెద్దల వరకూ మధుమేహం సమస్య అందరికీ సాధారణమైపోయింది. ఈ వ్యాధి ఉన్నవారి పాదాలకు వచ్చే సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటో చూద్దాం.

మధుమేహం(షుగర్​) ఉందని తెలిస్తే వెంటనే అదుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.​ వీటిలో నరాల బలహీనత ప్రధాన సమస్య. షుగర్ అధికమైతే అరికాలుతో పాటు అరచేతిలో మంటలు వస్తాయి.. తిమ్మిర్లు అధికమవుతాయి. పాదాల నుంచి మొదలుకొని కాళ్లలోకి, ఆ పైభాగానికి తిమ్మిర్లు వ్యాపిస్తాయి. దీర్ఘకాలికంగా మూత్రపిండాలు విఫలమై డయాలసిస్​ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటితోపాటు కళ్లపై, గుండెపై కూడా మధుమేహం ప్రభావం పడుతుంది. గాయాలు తగిలనపుడు నిర్లక్ష్యం వహిస్తే అవి మానకపోగా.. చివరకు కాళ్లు, వేళ్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

జాగ్రత్తలు:

  • సాధారణ మధుమేహ పరీక్షలో షుగర్​ స్థాయి 180 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.
  • మూడు నెలలకు ఒకసారి చేసే హెచ్​బీఏ1సీ పరీక్షలో షుగర్ 7 కంటే తక్కువ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి
  • నరాల్లో ఉండే మైలిన్​ షీత్​ తగ్గడం వల్ల నరాల బలహీనత లాంటివి అధికమవుతాయి. విటమిన్​ బీ12 తీసుకుంటే ఈ సమస్య అదుపులోకి వస్తుంది.
  • చెప్పులు ఎల్లప్పుడు వేసుకోని తిరగాలి.
  • గాయాలు తగిలినపుడు జాగ్రత్తగా ఉండాలి.

నరాల బలహీనత పెరిగి.. నొప్పులు అధికమైతే వెంటనే డాక్టర్లను సంప్రదించి వారి సలహాలు స్వీకరించాలి.

ఇదీ చదవండి:మతిమరుపు సమస్యా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details