తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఒత్తిడితో శృంగార జీవితంపై ప్రభావం.. నిజమెంత? - ఒత్తిడి

మానసిక ఒత్తిడి.. తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రక్తపోటు, గుండెపోటు వంటి ఎన్నో రోగాలకు కారణమవుతుంది. ప్రశాంతతను నాశనం చేస్తుంది. దీంతో ఎక్కువ స్థాయిలో స్ట్రెస్​ హార్మోన్లు విడుదలై ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడి కారణంగా జీవక్రియల క్రమం తప్పుతుంది. మానసికంగా, శారీరకంగా మనిషిని కుంగదీస్తుంది. ముఖ్యంగా శృంగార జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అయితే శృంగార జీవితంపై ఒత్తిడి ప్రభావమెంత?

Depression effect on sexual life
ఒత్తిడితో శృంగార జీవితంపై ప్రభావం

By

Published : Sep 14, 2021, 9:30 AM IST

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య 'ఒత్తిడి'. శారీరకంగానైనా.. మానసికంగానైనా మన జీవితంలో అదొక భాగమైపోయింది. బాగా ఒత్తిడికి గురైనా, కోపం వచ్చినా మన శరీరంలో కార్టిసోల్‌, అడ్రినలిన్‌ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. నిత్యం ఒత్తిడికి గురయ్యే వారిపై ఇవి సెక్స్​ పరంగా దుష్ప్రభావం చూపుతాయి. తరచూ ఒత్తిడికి గురవ్వడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి వల్ల శృంగార కోరికలు ఎందుకు తగ్గుతాయి?

శరీరం ఒత్తిడికి గురవగానే స్ట్రెస్​ హార్మోన్లు విడుదల అవుతాయి. సాధారణంగా ఒత్తిడి రెండు రకాలుగా ఉంటుంది. కొందరిలో ఒత్తిడి తాత్కాలికంగా ఉంటే.. మరికొందరిలో సుదీర్ఘంగా ఉంటుంది. తాత్కాలిక ఒత్తిడితో హఠాత్తుగా ఆందోళన, ఆత్రుత వస్తుంది. వెంటనే తగ్గిపోతుంది. దీంతో ఎలాంటి సెక్స్​ సమస్యలు తలెత్తవు. అయితే నిత్యం మానసిక ఒత్తిడి ఉన్నవారిలో స్ట్రెస్​ హర్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. దీంతో రక్తనాళాలు వ్యాకోచించవు. ఇది వారి శృంగార జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పురుషుల్లో అంగస్తంభన లోపం తలెత్తుతుంది. మహిళల్లో సెక్స్​ కోరికలు తగ్గిపోతాయి. ఫలితంగా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి. అందుకే ప్రశాంతంగా ఉండటం అలవరుచుకోవాలి.

ఎంత పెద్ద పనిలో ఉన్నా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ప్రశాంతంగా ఉండాలి. అలాగే పనిలో రిలాక్స్డ్​గా (విశ్రాంతి) ఉండటం నేర్చుకోవాలి. ఒత్తిడిని మేనేజ్​ చేసుకుంటూ.. మనుసును శాంతంగా ఉంచుకున్నప్పుడే శృంగార జీవితం సుఖంగా ఉంటుంది.

ఇదీ చూడండి:అంగ స్తంభన లోపం ఉందా?- అయితే ఇవి తినండి!

ABOUT THE AUTHOR

...view details