2020లో కోవిడ్ ప్రారంభమైన తరువాత వైద్యులు, నిపుణులు ఈ అంటువ్యాధిని చికిత్సించడానికి కృషి చేస్తూనే ఉన్నారు. వ్యాధి లక్షణాలను తగ్గించే ఔషధాలనయితే వాడుకలోకి తెచ్చారు కానీ దీనిని పూర్తిగా నయం చేయటం అసాధ్యంగానే ఉంది. అల్లోపతి వైద్యంలోనే కాక హోమియో, ఆయుర్వేదాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. హోమియోపతిలో జరుగుతున్న పరిశోధన గురించి తెలుసుకోటానికి డా.రాజన్ శంకరన్ తో ఈటీవీ భారత్ సుఖీభవ మాట్లాడింది.
డా. రాజన్ ప్రపంచ వ్యాప్తంగా వందలాది కొవిడ్ రోగుల లక్షణాలను పరిశీలించి వాటిని 4 తరగతులుగా వర్గీకరించారు. వాటికి ఔషధాలు, మోతాదు సూచించారు. ఈ కింద సూచించిన ఔషధాలు వైద్యుని పర్యవేక్షణలోనే వేసుకోవాలి. ఒక ఔషధాన్ని మాత్రమే లక్షణాలను బట్టి 7 రోజుల పాటు వాడాలి. అవాంఛిత లక్షణాలు కలిగితే హోమియో వైద్యున్ని సంప్రదించాలి.
కొవిడ్ రోగులు వాడాల్సిన ఔషధాలు:
- ఆర్సనిక్ ఆల్బమ్ 1ఎమ్. : 4 మాత్రలు 6 గంటలకొకసారి.
ఆందోళన, దప్పిక, విరేచనాలు. దగ్గు, జ్వరం, చలి లక్షణాలున్నప్పుడు తీసుకోవాలి.
- బ్రయోనియా ఆల్బా 1ఎమ్.: 4 మాత్రలు 6 గంటలకొకసారి.
నాలుక పిడచకట్టినపుడు, దప్పిక, పడుకోవటానికి, కదలటానికి ఆశక్తి లేకపోవటం, మాట్లాడే టప్పుడు వచ్చే పొడిదగ్గు, శబ్దాలను సహించలేకపోవటం లాంటి లక్షణాలున్నపుడు వాడాలి.
- క్యాంఫొరా 1ఎమ్.:4 మాత్రలు 6 గంటలకొకసారి