తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

డార్క్ చాక్లెట్​తో ప్రయోజనాలెన్నో..! అవేంటో తెలుసా..? - dark chocolate for blood pressure

చాక్లెట్లంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాక్లెట్లను తినడానికి మనం కారణాలను వెతుకుతూ ఉంటాం. మార్కెట్లలో అనేక రకాల చాక్లెట్లున్నాయి. అయితే డార్క్​ చాక్లెట్లు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయి. ఇవి కోకో గింజల నుంచి తయారవుతాయి. ఇవి మన గుండె ఆరోగ్యం నుంచి మంచి కొవ్వును పెంపొందించేవరకు అనేక రకాలుగా ప్రయోజనాలను కలగజేస్తాయి. అంతేకాదు మెదడుకు రక్తప్రసరణను అందజేయడంలో కూడా డార్క్​ చాక్లెట్లు బాగా దోహదపడతాయి. ఇన్ని ప్రయోజనాలను కలిగించే డార్క్​ చాక్లెట్ల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

complete information about dark chocklate
డార్క్ చాక్లెట్ తినడం వల్ల ప్రయోజనాలు

By

Published : Jan 25, 2023, 10:06 AM IST

డార్క్ చాక్లెట్ తినడం వల్ల ప్రయోజనాలు

డార్క్​ చాక్లెట్లు ఎన్నో రకాలుగా మనకు లభ్యమవుతున్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మామూలుగానే చాక్లెట్లంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. డార్క్​ చాక్లెట్లలో అధిక క్యాలరీలు ఉండటం వల్ల బరువు పెరిగే అవకాశం లేకపోలేదు. అందువల్ల వీటిని ఎక్కువగా తినకుండా జాగ్రత్తపడాలి. డార్క్​ చాక్లెట్​ తయారీలో వాడే కోకో పౌడర్​లో యాంటీ ఆక్సిడెంట్స్​ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. అదిగాక డార్క్ చాక్లెట్​ను రెగ్యులర్​గా సరైన మోతాదులో తీసుకుంటే చలికాలంలో శరీరంలో వేడిని పెంచి, చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది.

డార్క్​ చాక్లెట్లను సరైన మోతాదులో తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ చాక్లెట్​లో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. ఎందుకంటే దానిలో చక్కెర, బటర్ ఉంటుంది. 100 గ్రాముల చాక్లెట్​ను తీసుకుంటే అందులో 600 క్యాలరీలు ఉంటాయి. ముఖ్యంగా ఈ చాక్లెట్లలో మంచి మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్, యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.

డార్క్ చాక్లెట్​లో ఉండే మినరల్స్:

  • మాంగనీస్
  • కాపర్
  • జింక్
  • సెలీనియం
  • అయాన్
  • ఓలిక్ యాసిడ్స్(గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఆసిడ్స్)
  • దీంతో పాటు స్టీరిక్, పాల్మిటిక్ ఆసిడ్స్ అనే ఫ్యాటీ యాసిడ్స్ కూడా డార్క్​ చాక్లెట్​లో ఉంటాయి. మన గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ (ఫ్లేవర్​ నాయిడ్స్,పాలిఫినాల్స్) ఉంటాయి.

ఫ్లేవనాయిడ్స్:మన గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్​ను మన రక్తంలో పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది బ్లడ్ ప్రెజర్​ను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

ప్రయోజనాలు:

  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం
  • రక్తపోటును నియంత్రించడం
  • చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచడం
  • మెదడుకు రక్త ప్రసరణ అయ్యేలా చూడడం
  • డయాబెటిస్ నుంచి రక్షణ

అయితే లావుగా ఉండే వారికి డార్క్ చాక్లెట్ అంత మంచిది కాదు. ఇందులో ఉండే చక్కెర క్యాలరీలు లావుగా ఉండేవారికి మరిన్ని సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి డార్క్ చాక్లెట్​ను తక్కువ మోతాదులో తినాలి. దాదాపుగా 30 గ్రాముల డార్క్ చాక్లెట్ తింటే ఒకేసారి 150 క్యాలరీలు శరీరంలో చేరతాయి. బ్లడ్ ప్రెజర్ తగ్గడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. చక్కెర, కొవ్వు శాతం తక్కువ ఉండే చాక్లెట్లను తింటే మనకు పై ప్రయోజనాలన్నీ వస్తాయి. అలాగే ఎండ వల్ల కలిగిన స్కిన్ డామేజ్​ను కూడా డార్క్ చాక్లెట్ చాలా వరకు తగ్గిస్తుంది.

డార్క్ చాక్లెట్

ఎంత మోతాదులో తీసుకోవాలి:ఎప్పుడైతే మీరు డార్క్ చాక్లెట్ తినేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది. 100 గ్రాముల కంటే ఎక్కువ డార్క్ చాక్లెట్​ను తింటే బరువు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే చాక్లెట్​ను మోతాదుకు మించి తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో తీసుకుంటే డార్క్ చాక్లెట్ తినడం వల్ల వచ్చే ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.

డార్క్​చాక్లెట్​లో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్లు తినడం వల్ల శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ పెరుగుతుందని అద్యయనాలు సూచిస్తున్నాయి. నైట్రిక్ ఆక్సైడ్ మీ శరీరంలో సహజంగా లభించే పదార్థం. ఇది రక్తనాళాలలో చిన్న గ్రాహకాలపై పనిచేసి వాటిని విడదీయడానికి సహాయపడుతుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. మిల్క్ చాక్లెట్లలో 50 శాతం కోకోబీన్స్ ఉంటాయి. డార్క్ చాక్లెట్లలో ఎక్కువ శాతం క్యాలరీలు ఉంటాయి. కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. డార్క్ చాక్లెట్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ చాక్లెట్లను తినడం వల్ల మన స్వింగ్స్ మారుతుంటాయి. కాబట్టి డార్క్ చాక్లెట్లు తిని మన మూడ్​ను పాజిటివ్​గా మార్చుకోవచ్చు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనంలో అప్పుడప్పుడు చాక్లెట్లు తిననివారికంటే ఎక్కువగా తిన్నవారే సన్నగా ఉన్నారని తేలింది. డార్క్ చాక్లెట్ క్యాలరీలతో నిండి ఉన్నప్పటికీ బరువు తగ్గడానికి అనుకూలంగా ఉండే పదార్థాలు ఇందులో ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. భోజనం చేసిన తర్వాత బరువు పెరగడాన్ని అరికట్టవచ్చని మరో అధ్యయనం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details