తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బీపీ, షుగర్, ఊబకాయం.. ఈ జాగ్రత్తలు పాటిస్తే దూరం! - హెల్త్ న్యూస్​

Dangerous Lifestyle Diseases: ఒకప్పుడు 50ఏళ్లు దాటిన వారే అనారోగ్యానికి గురయ్యేవారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల చిన్న వయసులోనే రోగాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, నిద్ర సమయం, పనివేళలు మారడం వల్ల శరీరంలో సమతుల్యత లోపిస్తోంది. దీనివల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

Dangerous Lifestyle Diseases
జీవనశైలి వ్యాధుల నియమాలు

By

Published : Apr 3, 2022, 4:15 PM IST

Updated : Apr 3, 2022, 4:21 PM IST

Dangerous Lifestyle Diseases: ఇటీవల కాలంలో జీవనశైలి వ్యాధులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవనశైలి కారణంగా అనేక మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహ, ఊబకాయం సమస్యలతో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. చిన్న వయసులోనే చాలా మంది జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మందికి జన్యుపరంగా కొన్ని దీర్ఘకాల వ్యాధులు వస్తాయి, అలాంటి వారు జన్యువులను మార్చుకోలేరు కనుక జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని అంటున్నారు నిపుణులు. జీవనశైలిలో చిన్నపాటి పాటు మార్పులు చేసుకుంటూ, ఆరోగ్యకరమైన అలవాట్లతో జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

జీవనశైలి అంటే?: మనం రోజూ తినే ఆహారం, చేసే వ్యాయామం, కంటి నిండా పడుకునే నిద్ర, శరీరానికి ఎంత ఒత్తిడిని తీసుకుంటున్నాం.. వీటన్నింటి కలయికే జీవనశైలి. అందులో చిన్నపాటి మార్పులు చేసుకుంటే మనం అధిక రక్తపోటు​, మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాల వ్యాధుల బారిన పడుకుండా కాపాడుకోవచ్చు. నిపుణులు సూచించిన ఆరోగ్యకరమైన నియమాలను తెలుసుకుందాం.

  • రోజూ సరైన సమయానికి నిద్రలేవడం, పడుకోవడం
  • రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి
  • రోజూ 45 నిమిషాల నుంచి గంట పాటు యోగా/ ప్రాణాయామం/ వ్యాయామం చేయాలి
  • జంక్​ఫుడ్​ను తినడం తగ్గించాలి
  • శరీరానికి బలాన్ని ఇచ్చే మంచి ఆహారాన్ని తీసుకోవాలి
  • చిరుధాన్యాలు, తృణధాన్యాలు తినాలి
  • మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి
  • సామర్థ్యానికి మించిన ఒత్తిడి తీసుకోకూడదు
  • అన్ని రకాల పండ్లు ఎక్కువగా తినాలి

ఇదీ చదవండి:కొవ్వును సులభంగా కరిగించేందుకు ఆరు సూత్రాలు!

Last Updated : Apr 3, 2022, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details