తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

షాంపూలు వాడినా 'చుండ్రు' పోవడం లేదా?.. ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే రిజల్ట్స్​ పక్కా​!

Dandruff Home Remedies : వాతావరణంలో కాలుష్యంతో పాటు ధుమ్ము, ధూళి లాంటి వాటివల్ల చాలామంది చుండ్రు సమస్య వస్తుంది. ఒకసారి చుండ్రు వచ్చిందంటే.. దానిని పోగొట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. చుండ్రు సమస్యతో బాధపడేవారు మార్కెట్‌లో దొరికే అనేక రకాల షాంపూలను వినియోగిస్తారు. కానీ ఇంట్లోనే ఉండి కొన్ని చిట్కాలతో చుండ్రును తొలగించుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

dandruff home remedies in telugu tips to prevent dandruff
dandruff home remedies in telugu tips to prevent dandruff

By

Published : Jun 23, 2023, 7:16 AM IST

Dandruff Home Remedies : మారిన వాతావరణ పరిస్థితులు, కాలుష్యం వల్ల చుండ్రు సమస్యలతో చాలామందికి బాధపడుతూ ఉంటారు. చుండ్రు వల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది. చుండ్రు జుట్టులో పేరుకుపోవడం వల్ల తలలో అనేక సూక్ష్మజీవులు నివసిస్తాయి. వీటి వల్ల కూడా శరీరానికి నష్టం జరుగుతోంది. చుండ్రు సమస్య వల్ల అసౌకర్యంగా ఉండటం వల్ల చాలామంది జుట్టు లాగుతూ ఉంటారు. దీని వల్ల జుట్టు త్వరగా ఊడిపోతూ ఉంటుంది. అలాగే చుండ్రు వల్ల ఫంగల్ ఇన్పెక్షన్లు కూడా వచ్చే అవకాశముంటుంది.

Tips To Prevent Dandruff : అయితే చుండ్రు సమస్య నుంచి బయటపడటానికి చాలామంది రసాయనాలతో తయారుచేసిన మార్కెట్‌లో లభించే అనేక షాంపూలు, క్రీములను వాడుతూ ఉంటారు. వాటితో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుందని భావిస్తూ ఉంటారు. కానీ మార్కెట్‌లో లభించే షాంపుల వల్ల ఒక్కొక్కసారి చుండ్రు పోకుండా అలాగే ఉంటుంది. కానీ కొన్ని ఇంటి చిట్కాలతో చుండ్రును తొలగించుకోవచ్చు.

టీ చెట్టు ఆయిల్‌తో అలా..
Hair Dandruff Home Remedies : టీ చెట్టు ఆయిల్‌లో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల టీ చెట్టు ఆయిల్ కలుపుకుని జుట్టుకు మర్దన చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత తలను షాంపుతో వాష్ చేసుకోవాలి. వారంలో రెండు లేదా మూడు రోజులు ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది.

నిమ్మకాయ రసం
Dandruff Home Tips : నిమ్మకాయ రసంలో ఎసిడిటీ లక్షణాలు ఉంటాయి. ఇది నెత్తిమీద చర్మాన్ని ఆరోగ్యవంతం చేసి చుండ్రు రాకుండా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలోకి తాజా నిమ్మ రసాన్ని తీసుకోవాలి. వాటిలో కొంచెం నీటిని కలపాలి. ఆ తర్వాత దూదితో మీ జుట్టుకు రాసుకుని కొద్దిసేపు మర్ధన చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు, మూడుసార్లు ఇలా చేస్తే చుండ్రు పోయే అవకాశం ఉంటుంది.

కొబ్బరినూనెతో చుండ్రు దూరం
Dandruff Coconut Oil : కొబ్బరి నూనెతో చుండ్రు సమస్యకు చెక్ పెట్టేయవచ్చు. కొబ్బరినూనె చుండ్రును తొలగించడం వల్ల బాగా సహాయపడుతుంది. ఇందుకోసం లిక్విడ్‌గా తయారయ్యేవరకు కొబ్బరినూనెను వేడి చేయాలి. తర్వాత జుట్టుకు రాసుకుని గంటపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత షాంపుతో జుట్టును వాష్ చేసుకోవాలి. వారంలో రెండు రోజుల పాటు ఇలా చేస్తే చుండ్రు దూరమవుతుంది.

అలోవేరా జెల్
Dandruff Aloevera : అలోవేరా ఆకుల నుంచి తీసిన తాజా అలోవేరా జెల్‌ను తీసుకోవాలి. ఈ జెల్‌ను జుట్టుపై కొద్ది నిమిషాలపాటు మర్దన చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత జట్టును వేడినీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల కూడా చుండ్రు సమస్య తొలగిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details