COVCUR ORAL DROPS AND SPRAY : రోజుకో రూపుమార్చుకుని మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేసి ఆయువు తీస్తున్న కొవిడ్ మహమ్మారి కట్టడికి ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారు కొవిడ్ బారిన పడడం, రోజుకోరకమైన వేరియంట్ పుట్టుకురావడంతో మానవాళిలో ఆందోళన నెలకొంది. ఈ సమయంలో తాము తీసుకొచ్చిన "కొవిక్యూర్" కొవిడ్ సహా పలు వైరస్‌లను సులభంగా అంతం చేస్తోంది అంటున్నారు కొవిక్యూర్ బయోటెక్నాలజీస్ వ్యవస్థాపకలు డాక్టర్ విజయ్కానూరు.
COVCUR ORAL DROPS AND SPRAY : 'ఈ స్ప్రే వాడితే కొవిడ్ మీ దరిచేరదు'.. - కొవిక్యూర్ ఓరల్ డ్రాప్స్
COVCUR ORAL DROPS AND SPRAY : కొవిడ్ ఈ పేరు వినగానే.. ఎంతటివారిలోనైనా కలవరం కలుగుతోంది. వ్యాక్సిన్ వచ్చిందని ఆనందపడినప్పటికీ టీకా తీసుకున్న వారు కూడా కొవిడ్ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు 15 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ లేకపోవడం, పాఠశాలలు, కార్యాలయాల్లో పలు సందర్భాల్లో మాస్కు ధరించకుండా ఉండడం వల్ల ఈ మహమ్మారి వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో కొవిడ్‌ను తమ ఉత్పత్తులతో ఆదిలోనే అంతం చేయొచ్చు అంటున్నారు కొవిక్యూర్ బయెటెక్నాలజీస్ వ్యవస్థాపకులు డాక్టర్ విజయ్కానూరు.
ఓరల్ స్ప్రేను రెండేళ్ల వయస్సు దాటిన పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడొచ్చని డాక్టర్ విజయ్కానూరు తెలిపారు. రెండేళ్లలోపు పిల్లలకు చుక్కల మందు అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్‌లో పసుపు ఆధారిత సిస్టస్... యూకేలో రాక్‌రోజ్ వైరోస్టాప్... స్వీడన్‌లో కోల్డ్‌జైమ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ముంబాయి ఆధారిత ఆంకోకర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకొచ్చిన కోవిక్యూర్ కొవిడ్-19 ప్రొటెక్షన్ నానో కుర్కుమిన్ ఉత్పాదనను నేషనల్ ఇమ్మూనోజెన్‌సిటీ, బయోలజీస్ ఎవల్యూషన్ సెంటర్ సైతం ధృవీకరించిందని తెలిపారు. ఒమిక్రాన్ సంక్రమణ అడ్డుకునే ఈ 25 మిల్లీలీటర్ల కోవిక్యూర్ స్ప్రే ఖరీదు రూ.499మాత్రమేనని వెల్లడించారు. దీనిని రోజుకు 2 నుంచి మూడు సార్లు నోట్లో స్ప్రే చేసుకుంటే... వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని డాక్టర్ విజయ్ కానూరు భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి:ఐదేళ్లుగా మంచానికే పరిమితం- కొవిషీల్డ్ టీకా తీసుకున్నాక లేచి నిలబడ్డాడు!