Cosmetics Care: తల నుంచి కాలి గోటి దాక నేడు ఏదో ఒక సౌందర్య సాధనాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ సౌందర్య సాధనాల్లో రంగు, సువాసనల కోసం అనేక రకాల రసాయనిక పదార్థాలను, కృత్రిమ రంగుల్ని కలుపుతారు. అంతేకాదు ఈ కాస్మొటిక్స్ చాలాకాలం పాటు నిల్వ ఉండేందుకు వీలుగా ప్రిజర్వేటివ్స్ను సైతం జోడిస్తారు. ఈ రసాయనాల మూలంగా చర్మానికి దద్దుర్ల నుంచి క్యాన్సర్ల వరకు ఎన్నో రకాల అనర్థాలు వచ్చి పడుతుంటాయి.
వేసవిలో కాస్మొటిక్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తెలుసుకోండి.. - safety precautions for cosmetics
Cosmetics Care: ఎండలు మండిపోయే వేసవి కాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతల కారణంగా మన చర్మమంతా ఒకటే చెమ్మగా, జిడ్డుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం వాడే సౌందర్య సామాగ్రి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిలోని రసాయనాల మూలంగా మన చర్మానికి సమస్యల బెడద పెరిగే అవకాశం ఉంటుంది. వేడి, ఉక్కపోతకు క్రీములు, లోషన్లు, ఇతరత్రా కాస్మొటిక్ రసాయనాలు.. మన చర్మానికి లేనిపోని ఉపద్రవాలను తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ముగిసేవరకు క్రీములు, లోషన్లు, సెంట్లు, డియోడ్రెంట్ల లాంటి కాస్మొటిక్స్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
cosmetics precautions
కాస్మొటిక్స్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- సిని తారలు, పక్కింటివారు వాడుతున్నారని మనమూ అలాంటి కాస్మొటిక్స్ వాడేందుకు ప్రయత్నించకూడదు.
- మన చర్మ తత్వానికి సరిపోయేవాటినే ఎంచుకొని వాడాలి.
- ఇంట్లోనూ ఒకరు వినియోగించే సౌందర్య సాధనాలను మరొకరు వినియోగించకూడదు.
- మేకప్ వేసుకునేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- కాస్మొటిక్స్ వాడిన వెంటనే మూతపెట్టేయాలి. లేకుంటే ఫంగస్ చేరే ప్రమాదముంది.
- సౌందర్య సాధనాలు కాస్త ఖరీదైనవే కొనుక్కోవడం మేలు.
- సౌందర్య సాధనాలనేవి కేవలం తాత్కాలికంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అందుకే సాధ్యమైనంతవరకు అతిగా కాస్మొటిక్స్ వాడకుండా ఉండటమే మేలు.