తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

తస్మాత్​ జాగ్రత్త: పొగతాగేవారికి కరోనాతో అధిక ముప్పు - Coronvirus effect organs

పొగ తాగేవారిపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ధూమపానం చేస్తున్నవారికే కాదు.. గతంలోనూ పొగ అలవాటు ఉన్నవారికి ఈ ముప్పు పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Coronavirus has a serious effect on smokers: Researchers
పొగతాగేవారిపై కరోనా ప్రభావం ఎక్కువే!

By

Published : Oct 15, 2020, 12:26 PM IST

ఒకవైపు ఊపిరితిత్తుల మీద దాడిచేసే కరోనా. మరోవైపు ఊపిరితిత్తులను దెబ్బతీసే పొగ అలవాటు. ఫలితంగా కరోనాతో ముప్పు, వ్యాధి తీవ్రత పెరగకుండా ఉంటాయా? పరిశోధనలూ ఇదే విషయాన్నిపేర్కొంటున్నాయి. కొవిడ్‌-19కు చికిత్స తీసుకుంటున్నవారిని పరిశీలిస్తే.. పొగ అలవాటు లేనివారిలో 17.6% మందికి కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక పొగ తాగేవారిలో అయితే 29.8% మంది అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నారు.

పొగ అలవాటు కొనసాగిస్తున్నవారిలోనే కాదు, గతంలో పొగ అలవాటు ఉన్నవారికి ఇలాంటి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివైనా ఎలక్ట్రానిక్​ సిగరెట్లయినా శ్వాస మార్గాలను దెబ్బతీసేవే. రోగనిరోధక శక్తి సామర్థ్యాన్ని తగ్గించేవే. అందుకే పొగ అలవాటు గలవారికి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కాబట్టే కొవిడ్‌-19 పోరాటంలో భాగంగా పొగ అలవాటును మానెయ్యాలంటూ అవగాహన చేపట్టాలని పరిశోధకులు గట్టిగా సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:జబ్బుల మాట వినిపిస్తోందా! పెడచెవిన పెట్టకండి

ABOUT THE AUTHOR

...view details