తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

లక్షణాలు ఇలా ఉన్నాయా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి... - కరోనా న్యూస్​

కరోనా సెకండ్​ వేవ్​లో ఒక్కొక్కరిలో ఒక్కో విధమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. తలనొప్పి, వణుకు, కళ్లు ఎర్రబడటం, నీరసపడిపోవటమూ కరోనా లక్షణాల్లో చేరాయి. కడుపులో వికారం, వాంతులు వంటి లక్షణాలు రెండో దశ వైరస్ వ్యాప్తిలో చాలా మంది బాధితుల్లో కనిపిస్తున్నాయి. ఇంకా ఈ జాబితాలో ఏ లక్షణాలున్నాయి? వైరస్ బారిన పడిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

corona new symtoms
కరోనా లక్షణాలు, జాగ్రత్తలు

By

Published : May 4, 2021, 11:13 AM IST

Updated : May 4, 2021, 3:39 PM IST

కరోనా మహమ్మారి దేశంలో అంతకంతకూ విస్తరిస్తోంది. రోజుకూ 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. సెకండ్​ వేవ్​లో వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా తొలి దశలో జలుబు, దగ్గు, జ్వరం ఈ మూడు లక్షణాలు ప్రధానంగా కనిపించేవి. వైరస్ స్వభావం క్రమంగా మారుతూ వచ్చింది. ఉత్పరివర్తనాలు... వైరస్ ప్రభావాన్ని తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో లక్షణాల్లోనూ మార్పులు వచ్చాయి. గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు ఇలాంటివన్నీ తోడయ్యాయి. ఫలితంగా ఈ లక్షణాల జాబితానూ పెంచుకుంటూ వస్తోంది డబ్ల్యూహెచ్​ఓ. వైరస్‌ జన్యుక్రమం మారుతున్న కొద్ది... కొవిడ్ లక్షణాలు మారిపోతున్నాయి. ఇప్పుడు సెకండ్​ వేవ్​లో తలనొప్పి, వణుకు, కళ్లు ఎర్రబడటం, నీరసపడిపోవటం వంటి కొత్త లక్షణాలు బాధితుల్లో కన్పిస్తున్నాయి. ఆ జాబితాను ఓ సారి చూడండి.

కరోనా కొత్త లక్షణాలు

ఈ లక్షణాలు కన్పిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్ష చేయించుకోండి. వైద్యుల సూచన మేరకే ఔషధాలు వాడండి. కరోనా సోకిన వారిలో అధిక శాతం మంది ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే నయమవుతుంది.

ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా నిర్ధరణ అయితే ఏం చెయ్యాలి?

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Last Updated : May 4, 2021, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details