తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వండిన వాటి కంటే పచ్చి ఆహారం మేలైనదా? - Raw Foods Health Benefits

Cooked Foods Vs Raw Foods : మనం హెల్తీగా ఉండడానికి మంచి ఫుడ్స్ తీసుకోవడం తప్పనిసరి. లేదంటే వివిధ ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. అయితే దాదాపుగా అందరూ నిత్యం ఉడకబెట్టిన ఆహారాలనే తింటుంటారు. కొందరు పచ్చి ఆహారాన్ని తీసుకుంటారు. మరి.. ఈ రెండింటిలో ఏది బెస్ట్?

Cooked Foods Vs Raw Foods
Cooked Foods Vs Raw Foods

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 3:13 PM IST

Raw Foods Vs Cooked Foods :ఆరోగ్యంగా ఉండడంలో మన ఆహారపు అలవాట్లు కీలకపాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే చాలా వరకు ఉడికించిన ఆహార పదార్థాలనే అందరూ తీసుకుంటారు. కొందరు ఎక్కువగా పచ్చివే తింటుంటారు. మరి.. ఏవి తినాలి? ఉడికించిన ఆహారాలు తీసుకుంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయా? పచ్చివి తింటేనా? అనే సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉడికించిన ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు..

మెరుగైన జీర్ణశక్తి :ఉడికించిన ఆహారం నమలడానికి ఈజీగా ఉంటుంది. ఫలితంగా తీసుకున్న ఫుడ్ తొందరగా జీర్ణం అవుతుంది. అలాగే జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పట్టే కొన్ని ఫైబర్​లు, ప్రొటీన్​లు విచ్ఛిన్నం అవుతాయి. అరుగుదలకు తోడ్పడుతాయి.

మరిన్ని పోషకాలు :వంట చేయడం వల్ల మొక్కల బయటి కణత్వచాలు, మాంసాహార ప్రొటీన్ నిర్మాణాలు విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా.. మెరుగైన పోషకాలు గ్రహించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

శక్తి విడుదల :ఆహారాలను ఉడికించడం ద్వారా వాటిలో ఉన్న కార్బోహైడ్రేట్ల నుంచి ఎక్కువ శక్తి రిలీజ్ అవుతుంది. అప్పుడు మన శరీరం పోషకాలను మరింత సమర్ధవంతంగా గ్రహించి వినియోగించుకునేలా చేస్తుంది. ధాన్యాలు, పిండి కూరగాయలు వంటి ఆహారాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది.

మంచి రుచి, సువాసన : ఆహార పదార్థాలను వడికించడం ద్వారా వాటికి మంచి రుచి, సువాసన వస్తుంది. దాంతో తినాలనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే తినేటప్పుడు మంచి అనుభూతిని లభిస్తుంది.

చక్కటి ఆరోగ్యం :వంట చేయడం వల్ల వాటిలో ఏమైనా హానికరమైన బాక్టీరియా, పరాన్నజీవులు, వ్యాధికారక పదార్థాలు ఉంటే అవి నశిస్తాయి. కాబట్టి వండిన ఆహారం తినడం ద్వారా ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

Tips to Beat Menopause Belly in Telugu : నలభైల్లో పొట్ట పెరుగుతోందా.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

పచ్చి ఆహారాలు తీసుకోవడం ద్వారా పొందే బెనిఫిట్స్..

పోషకాల సంరక్షణ : ఉడికించిన వాటితో పోలిస్తే.. పచ్చి ఆహారాల్లో కొన్ని విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లను అధిక స్థాయిలో కలిగి ఉంటాయి. అందుచేత వీటిని తీసుకున్నప్పుడు సరైన పోషక కంటెంట్​ను బాడీకి ఇవ్వడానికి ఇవి దోహదం చేస్తాయి.

ఎంజైమ్స్ సేఫ్ : పచ్చి ఆహారాల్లో.. జీర్ణక్రియ, జీవక్రియలో సహాయపడే ఎంజైమ్‌లు ఉంటాయి. ఉడకబెట్టిన ఆహారంలో ఇవి నశిస్తాయి.

ఫైబర్ ఎక్కువ : పచ్చి పండ్లు, కూరగాయలు, గింజలలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియలో ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగే గట్ ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.

హైడ్రేషన్ : పండ్లు, కూరగాయలు వంటి అనేక పచ్చి ఆహారాలు అధిక నీటి కంటెంట్​ను కలిగి ఉండి బాడీని హైడ్రేట్​గా ఉంచుతాయి.

మెరుగైన జీర్ణ ఆరోగ్యం :ముడి ఆహారాలలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్‌లు సాధారణ పేగు కదలికలను పెంచుతాయి. తద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బరువు నియంత్రణ :పచ్చి ఆహారాలలో పోషకాలు దట్టంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇవి మంచి ఎంపిక. అలాగే వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ. అందువల్ల ఎక్కువగా తినకుండానే పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది.

చర్మ ఆరోగ్యం : ఉడకబెట్టని ఆహారంలో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి దోహదం చేస్తాయి.

మీకు రాత్రిపూట బ్రష్ చేసుకునే అలవాటు ఉందా? - లేదంటే గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది!

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

ABOUT THE AUTHOR

...view details