Coconut Health Benefits In Telugu :కొబ్బరికాయ అందరికీ సుపరిచితమే. ఈ కొబ్బరికాయను కొబ్బరి ముక్కలు, కొబ్బరి నీళ్లు, నూనె.. ఇలా అనేక రూపాల్లో ఇంట్లో వాడుతుంటాం. మరి కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ సారి తెలుసుకుందాం.
కొబ్బరి ముక్కలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం కూడా మంచిదేనని అంటున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని సూచిస్తున్నారు. కొబ్బరి నూనెను తలకు రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయని చాలా మంది నమ్ముతారు. అలాగే మరికొందరు కొబ్బరి నూనెను జుట్టుకు రాసుకోవడానికి మాత్రమే కాకుండా వంట నూనెగా కూడా వినియోగిస్తారు. మరి కొబ్బరి వల్ల కలిగే లాభనష్టాలేంటో?
కొబ్బరితో లాభాలు..
Coconut Health Benefits And Side Effects : కొబ్బరి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.' కొబ్బరిలో ట్రై గ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కొవ్వును కరిగించడంలో ఉపయోగపడతాయి. అందుకే అధిక బరువుతో బాధపడుతున్నవారు కొబ్బరి తింటే బరువు తగ్గుతారు. అలాగే కొబ్బరిలో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. కొబ్బరిలో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫైబర్, ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీపీ అదుపులో ఉంచుతుంది. కొబ్బరి వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. కొబ్బరి శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది' అని నిపుణులు చెబుతున్నారు.