Clay Pot Water Health Benefits : మన పూర్వీకులు మట్టి కుండల్లోని నీళ్లు తాగి చాలా ఆరోగ్యంగా ఉండేవారు. చాలా మంది సంప్రదాయాన్ని పాటించేవారు.. ఇప్పటికీ తమ ఇళ్లల్లో మట్టి పాత్రలే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే మట్టి కుండల్లోని నీళ్లు.. ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి.
మట్టి కుండల్లోని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
Health Benefits Of Clay Pot Water :
- ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి!
Minerals Enrichment In Pot Water : మట్టి కుండలు కాల్షియం, మెగ్నీషియం, ఐరెన్ లాంటి ఖనిజాలను చిన్న మోతాదులో నీళ్లలోకి విడుదల చేస్తాయి. దీని వల్ల నీటిలోని మినరల్ కంటెంట్ పెరుగుతుంది. అందుకే మట్టి కుండలోని నీళ్లు తాగితే మనకు చాలా విలువైన పోషకాలు లభిస్తాయి. - సహజ శీతలీకరణ
Natural Cooling System In Pot Water : మట్టి కుండల్లో నీళ్లు వేసి కొంత సేపు ఆగితే.. అవి సహజ సిద్ధంగానే చల్లగా మారతాయి. అంటే మట్టి కుండలకు సహజ శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. వాస్తవానికి మట్టి కుండల్లో బాష్పీభవన ప్రక్రియ జరుగుతుంది. దీని వల్ల మట్టి పాత్రల్లోని నీరు చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడంటే ఫ్రిజ్‌లు వచ్చాయి. కానీ ఒకప్పుడు వేసవిలో చల్లని నీరు తాగాలంటే.. కచ్చితంగా మట్టి పాత్రల్లోని నీరే త్రాగేవారు. - రుచి పెరుగుతుంది!
Is Pot Can Improve The Taste Of Water :ప్లాస్టిక్ లేదా లోహాలతో చేసిన పాత్రల్లోని నీళ్లు అంత సురక్షితమైనవి కావు. పైగా అవి అంత రుచిగా కూడా ఉండవు. కానీ మట్టి కుండల్లోని నీళ్లు మంచి రుచిగా ఉంటాయి. పైగా మట్టి కుండల్లోని నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య బాగా తగ్గుతుంది. - సూక్ష్మజీవులను నియంత్రిస్తుంది!
Pot Water Microbial Balance :మనం ప్లాస్టిక్ లేదా మెటల్‌తో చేసిన పాత్రల్లో నీటిని నిల్వ చేస్తే.. చాలా త్వరగా వాటిలో సూక్ష్మజీవులు పెరిగిపోతాయి. అదే మట్టి కుండలో నీళ్లు పోస్తే.. సూక్ష్మజీవుల బెడద తగ్గుతుంది. ఎందుకంటే మట్టి కుండల్లో సహజ సిద్ధంగా గాలి ప్రవహించేందుకు తగిన నిర్మాణం ఉంటుంది. కనుక ఆక్సిజన్ అనేది సరైన మోతాదులో మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా మట్టి కుండల్లో సూక్ష్మజీవులు పెరిగే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. - జీర్ణ సమస్యలకు చెక్!
Clay Pot Health Benefits : మట్టి కుండలోని నీళ్లు తాగితే.. జీర్ణ సమస్యలు నయం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే మీరు రెగ్యులర్‌గా కుండలోని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవడం మంచిది. - మెటబాలిజం పెరుగుతుంది!
మట్టి పాత్రల్లోని నీళ్లు తాగితే.. మన శరీరంలోని మెటబాలిజం బాగా పెరుగుతుంది. అంటే జీర్ణక్రియ బాగా వృద్ధిచెంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అతి బరువు సమస్యకు కూడా సహజంగానే చెక్ పడుతోంది. - గాయాలు నయమవుతాయి!
కుండల్లోని నీటిలో అనేక సహజ ఖనిజ లవణాలు ఉంటాయి. కనుక గాయాలు త్వరగా నయం అవుతాయి. గొంతు నొప్పి లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. - పర్యావరణానికి అనుకూలమైనది!
Eco Friendly Pots And Their Uses : లోహం లేదా ప్లాస్టిక్‌తో చేసిన పాత్రలు పర్యావరణానికి, ముఖ్యంగా మానవులకు తీవ్రమైన హాని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ హానికరమైన రసాయనాలను పర్యావరణంలోని విడుదల చేస్తూ ఉంటుంది. కానీ మట్టి కుండలు పర్యావరణానికి చాలా అనుకూలమైనవి. పైగా మట్టి కుండల వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. - చూశారుగా.. మీకు వీలైంతే వెంటనే.. ప్లాస్టిక్ వస్తువులను వాడడం వెంటనే మానేయండి. మట్టి కుండలను, మట్టి పాత్రలను వాడడం అలవాటు చేసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.