Chopping board side effects : కూరగాయలు సులభంగా కోయడానికి చాలా మంది చాపింగ్ బోర్డులు ఉపయోగిస్తారు. కొందరు కర్రవి వాడితే.. ఇంకొందరు ప్లాస్టిక్‌వి వినియోగిస్తారు. అయితే వాటిలో విషపూరితమైన మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని ఇటీవల చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. వాటి వల్ల వాపు, గ్లూకోజ్ మందగించడం, ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్తో పాటు పలు హృదయ సంబంధ వ్యాధులు వస్తాయని పరిశోధకులు తెలిపారు.
నార్త్ డకోటా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన ఈ రీసెర్చ్‌లో భారత సంతతికి చెందిన ఒకరు ఉండటం విశేషం. ఇది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ఆ అధ్యయనం ప్రకారం.. కర్ర, ప్లాస్టిక్ చాప్ బోర్డులపై క్యారెట్లను కట్ చేయడం వల్ల సంవత్సరానికి పది లక్షల సూక్ష్మకణాలు (మైక్రో పార్టికల్స్) ఉత్పత్తి అవుతాయని తేలింది. ఈ మైక్రో ప్లాస్టిక్లు కణాల ధ్వంసం, వాపునకు, ఎలర్జీ రియాక్షన్లకు, ఉబకాయానికి దారితీస్తాయి.
ఈ చాపింగ్ బోర్డులను అధికంగా రబ్బరు, వెదురు, కర్ర, ప్లాస్టిక్‌లతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ బోర్డులపై కత్తిలో కట్ చేసినప్పుడు అవి కొన్ని నానో, మైక్రో సైజు మచ్చలు ఏర్పడతాయి. కటింగ్ బోర్డులపై కోసినప్పుడు కత్తులకు అంటుకుంటున్న మైక్రో సైజు పరిణామం గల పార్టికల్స్‌ని సేకరించి పరీక్షించారు. దీని కోసం వారు అయిదుగురు వ్యక్తులు వివిధ రకాల పదార్థాలను కట్ చేసే విధానాన్ని, ఒక వ్యక్తి క్యారెట్‌తో, క్యారెట్ లేకుండా ఇతర పదార్థాలను కట్ చేసిన విధానాన్ని పోల్చి చూశారు.