Child Hyperactivity Disorder :కొందరు పిల్లలు సైలెంట్‌గా ఉంటే.. మరికొందరు బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఇలాంటి వారు ఉన్నచోట కుదురుగా ఉండక ఏదో ఒక పని చేస్తూ బాగా అల్లరి చేస్తుంటారు. పిల్లల అతి అల్లరికి ఏడీహెచ్‌డీ అనే వ్యాధి కారణం. దీనికి కచ్చితమైన కారణం లేకపోయినా.. అనేక అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. జన్యువుల ప్రభావం, మెదడులో రసాయనాలు అదుపు తప్పడం, గర్భిణులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, సీసం లాంటివి మెదడును ప్రభావితం చేయడం, మెదడుకు దెబ్బ తగలడం లాంటి వాటి వల్ల పిల్లలకు ఈ వ్యాధి వస్తున్నట్లు సైకియాట్రిస్ట్‌లు చెబుతున్నారు.
ADHD Symptoms In Children : ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. పిల్లల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలను 3 రకాలుగా వర్గీకరించారు. 1. దేన్నీ సరిగా పట్టించుకోరు. 2. కదలకుండా కూర్చుని చేసే పనుల్ని ఇష్టపడకపోవడం. తరచూ వస్తువులు పోగొట్టుకోవడం, పగటి కలలు కంటూ ఉండటం ఇందులోకి వస్తాయి. 3. అతి చురుకుదనం. కదలకుండా ఒకే దగ్గర కూర్చోలేకపోవడం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎప్పుడూ పరుగు తీయడం, ఇతరులు మాట్లాడుతుంటే అడ్డుపడటం లాంటివి చేస్తారు. ఈ లక్షణాల్ని బట్టి ప్రాథమికంగా ఒక అంచనాకు రావచ్చు.
Child Hyperactivity Treatment : పిల్లల్లో ఏడీహెచ్‌డీని నిర్ధరించడం చాలా కష్టం. ఏ ఒక్క పరీక్షతోనూ గుర్తించడం కుదిరే పని కాదు. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లతో సుదీర్ఘంగా ఆ లక్షణాలను చర్చించిన తర్వాత వారి ప్రవర్తనను పరిశీలించిన అనంతరం వైద్యులు ఒక అంచనాకు వస్తారు. ఏ లక్షణాలు ఎంత కాలం నుంచి ఉన్నాయనేది కూడా ముఖ్యమే. పిల్లల మానసిక స్థితిని పరిశీలించడానికి పలు పరీక్షలు చేస్తారు. పిల్లలతోపాటు వారి కుటుంబ సాంఘిక, వైద్య చరిత్ర తెలుసుకుంటారు.