తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఛాతీ మంటా? గుండెపోటా? ఎలా గుర్తించాలంటే.. - gas problem recognization

కొన్నిసార్లు ఛాతీ మంట, గుండెపోటు లక్షణాలు ఒకేలా కనిపిస్తుంటాయి. దీంతో కొందరు పొరపడుతుంటారు. గుండెపోటును ఛాతీమంటగా భావించి ప్రాణాల మీదికి తెచ్చుకోవటమూ చూస్తున్నాం. అందువల్ల వీటి లక్షణాల మధ్య తేడాలను తెలుసుకొని ఉండటం మంచిది.

Chest pain? or gas problem?
ఛాతీ మంటా? గుండెపోటా? ఎలా గుర్తించాలంటే..

By

Published : Jun 7, 2022, 7:31 AM IST

ఛాతీ మంట, గుండెపోటు రెండూ వేర్వేరు సమస్యలు. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం (జీఈఆర్‌డీ) వల్ల ఛాతీలో మంట తలెత్తుతుంది. ఇది మామూలు సమస్య. గుండె రక్తనాళాల్లో పూడికలు, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల రక్త సరఫరా ఆగిపోవటం గుండెపోటుకు మూలం. ఇది అత్యవసరమైన సమస్య. కొన్నిసార్లు ఛాతీ మంట, గుండెపోటు లక్షణాలు ఒకేలా కనిపిస్తుంటాయి. దీంతో కొందరు పొరపడుతుంటారు. గుండెపోటును ఛాతీమంటగా భావించి ప్రాణాల మీదికి తెచ్చుకోవటమూ చూస్తున్నాం. అందువల్ల వీటి లక్షణాల మధ్య తేడాలను తెలుసుకొని ఉండటం మంచిది. ఏదేమైనా అనుమానం వస్తే డాక్టర్‌ను సంప్రదించి నివృత్తి చేసుకోవటం మంచిది. మామూలు ఛాతీమంట అయితే ఇబ్బందేమీ లేదు. అదే గుండెపోటు అయితే ప్రాణాపాయం తలెత్తకుండా చూసుకోవచ్చు.

ఛాతీ మంటా? గుండెపోటా? ఎలా గుర్తించాలంటే..

ABOUT THE AUTHOR

...view details