Food Safety on Wheels: పుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌తో ఆహార కల్తీకి చెక్ - హైదరాబాద్‌లో పుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్
Food Safety on Wheels in hyderabad జీహెచ్ఎంసీలో ఆహార కల్తీ నివారణే లక్ష్యంగా ఫుడ్ సేఫ్టీ వాహనాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఆహారాన్ని తనిఖీ చేయడానికి ప్రత్యేక వాహనాల వినియోగిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ అన్నిచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆహార కల్తీ చేస్తే సులభంగా కనిపెట్టేలా వాహనంలో ల్యాబ్ ఏర్పాటైంది. వెంటనే ఫలితాలు వెల్లడించేలా ఏర్పాటు చేశారు. పుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్‌పై మరిన్ని వివరాలు... గ్రేటర్ హైదరాబాద్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ మాటల్లోనే విందాం.
Food Safety on Wheels in hyderabad ఉప్పు... పప్పు... పాలు... పిండి... కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు చేస్తున్న కల్తీతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. నకిలీ, కల్తీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలు బలంగా లేక కొంతమంది వ్యాపారులు యథేచ్ఛగా చేస్తున్న కల్తీల వల్ల ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆహార పదార్థాలు కల్తీ జరుగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఇప్పుడు అధికారులు పుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే మెుబైల్ వ్యాన్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా కల్తీ అనేది జరగకుండా ఉండేలా ఈ మెుబైల్ సేఫ్టీ వాహనాలను అన్ని రాష్ట్రాలకు అందించింది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐ. స్వయంగా హోటళ్లు, రెస్టారెంట్లు స్ట్రీట్ పుడ్ సెంటర్లు ఇలా అన్ని చోట్లకు వెళ్లి ఆహారాన్ని పరీక్షించనున్నారు. కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మరి, ఈ మెుబైల్ వ్యాన్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ ఫుడ్ కంట్రోలర్ బాలజీ.